చెన్నై ఎయిర్‌పోర్టులో తప్పిన భారీ ప్రమాదం
చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి చెన్నైకి వస్తున్న ఒక అంతర్జాతీయ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. విమానం రన్ వేపై దిగుతుండగా.. నాలుగో ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే స్పందించారు. వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. దీనితో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సంఘటన ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం రేపింది.
సిబ్బంది త్వరతగతిన స్పందించడంతో..
విమానం పైలట్లు వెంటనే పరిస్థితిని గుర్తించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) అధికారులకు సమాచారం అందించారు. దీంతో చెన్నై ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అత్యవసర సేవలను రంగంలోకి దించారు. వెంటనే ఫైర్ ఫైటర్లు, ఇతర అత్యవసర బృందాలు రన్‌వే వద్దకు చేరుకున్నాయి. వారు అతి తక్కువ సమయంలోనే విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు.

ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, గాయాలు గానీ జరగలేదు. విమానంలో ఉన్న సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. సిబ్బంది సమయస్ఫూర్తి, వేగవంతమైన చర్యల కారణంగా ఒక పెను విమాన ప్రమాదం తప్పింది. ప్రస్తుతం విమానం రన్‌వేపై నిలిపివేసి ఉంది. ఈ సంఘటనపై విమానాశ్రయ అధికారులు, విమానయాన సంస్థ దర్యాప్తు ప్రారంభించారు. విమాన ఇంజిన్‌లో మంటలు ఎలా చెలరేగాయనే దానిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుంది.












Click it and Unblock the Notifications