నిరూపిస్తావా? లేక గుంజిళ్లు తీస్తావా? మోడీకి దీదీ సవాల్..

బంకూరా : సార్వత్రిక ఎన్నికల్లో మరో రెండు విడతల పోలింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో నేతలు ప్రచారంలో జోరు పెంచారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. బెంగాల్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ.. దీదీ హయాంలో కోల్ మాఫియా రాజ్యమేలుతోందని విమర్శించారు. మోడీ కామెంట్లపై స్పందించిన మమతా బెనర్జీ ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు.

దీదీ హయాంలో కోల్ మాఫియా

దీదీ హయాంలో కోల్ మాఫియా

బంకూరాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ మమత సర్కారుపై విమర్శలు గుప్పించారు. కోల్ మాఫియాను నడుపుతున్న దీదీ కార్మికులను దోచుకుంటున్నారని అన్నారు. 'బొగ్గు గనుల్లో తృణమూల్ మాఫియా ఎలా చెలరేగిపోతుందో నా కన్నా మీకే ఎక్కువ తెలుస'ని అన్నారు.

నిరూపించాలని మమత సవాల్

నిరూపించాలని మమత సవాల్

ప్రధాని మోడీ ఆరోపణలపై బెంగాల్ సీఎం మండిపడ్డారు. టీఎంసీ అభ్యర్థుల్లో ఒక్కరిపై ఆరోపణలు రుజువుచేసినా 42మంది ఎంపీ అభ్యర్థులను విత్ డ్రా చేసుకుంటానని తేల్చి చెప్పారు. "తృణమూల్ అభ్యర్థికి కోల్ మాఫియాతో సంబంధముందని మోడీ అంటున్నారు. ఆయన ఆ ఆరోపణల్ని నిరూపిస్తే పార్టీ అభ్యర్థులందరినీ పోటీ నుంచి తప్పిస్తా. ఒకవేళ మీరు అబద్దం చెప్పినట్లు తేలితే వంద గుంజిళ్లు తీస్తారా" అని మమత సవాల్ విసిరారు.

ఆధారాలు బయటపెడతా

ఆధారాలు బయటపెడతా

తృణమూల్ పార్టీపై ఆరోపణలు చేస్తున్న ప్రధాని మోడీ.. బొగ్గు గనులు కేంద్రం పరిధిలోకి వస్తాయని, బీజేపీ నేతలు వాటికి ఏజెంట్లన్న విషయం మర్చిపోతున్నారని మమత విమర్శించారు. 'నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్‌ను బయటపెడితే కోల్ మాఫియా, ఆవుల స్మగ్లింగ్‌కు సంబంధించిన అన్ని విషయాలు బయటపడతాయ'ని దీదీ వార్నింగ్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+