తనను తానే...: బయటకోచ్చిన బేడీ భర్త, కేజ్రీకి మమత మద్దతు

న్యూఢిల్లీ: ఢిల్లీ సార్వత్రిక ఎన్నికలు మరో 48 గంటల్లో ప్రారంభం కానున్న సమయంలో మాజీ ఐపీఎస్ అధికారిణి, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ భర్త బ్రిజ్ మోహన్ గురువారం నాడు బయటకు వచ్చారు! తన భార్య బేడీకి మద్దతుగా ఆయన కమలదళంతో కలిశారు.

జనవరి 15వ తేదీన కిరణ్ బేడీ బీజేపీలే చేరిన విషయం తెలిసిందే. దీని పైన ఆయన మాట్లాడుతూ.. అది యాదృఛ్చికమే అన్నారు. కిరణ్ బేడీ ఎప్పుడు సామాజిక కార్యకర్తేనని, రాజకీయ నాయకురాలు కాదన్నారు. బీజేపీలో చేరకముందు ఓ సమయంలో తాను ఆమెతో మాట్లాడానని చెప్పారు. ఆ రోజు ఆమె బీజేపీలో చేరారని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

Mamata Banerjee supports AAP

2013లో 49 రోజుల పాటు పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ పైన విమర్శలు గుప్పించారు. 49 రోజులకే రాజీనామా చేయడం ద్వారా కేజ్రీవాల్ తన కాళ్ల పైన తానే కాల్చుకున్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్లీ తనను గెలిపించాలని అడుగుతున్నాడన్నారు. రాజీనామా చేయడం ద్వారా నాడు కేజ్రీవాల్ తన పాదాలను తానే కాల్చుకున్నట్లయిందన్నాడు. ఎవరు కూడా బాధ్యతతో కూడిన పదవిని తేలికగా తీసుకోవద్దని చెప్పారు.

కేజ్రీవాల్‌కు పాలనానుభవం లేదని కిరణ్ బేడీ అన్నారు. అందువల్లనే ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి అర్ధాంతరంగా వైదొలిగారన్నారు. అదే సమయంలో తాను ఐపీఎస్‌గా నలభై ఏళ్లు విజయవంతంగా పని చేశానని చెప్పారు. కాగా, బీజేపీ మద్యం, డబ్బు పంచుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు, తాము ఏఏపీకి మద్దతివ్వం లేదా తీసుకోమని కాంగ్రెస్ నేత అజయ్ మాకెనే ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆప్‌కు వామపక్షాల మద్దతు.. తాజాగా మమతా బెనర్జీ

ఆమ్ ఆద్మీ పార్టీకి వామపక్షాలు మద్దతు పలికాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+