డాబాలో దారుణం: ఎక్కువ తిన్నాడని దుస్తులిప్పేసి కొట్టారు

భోపాల్: తన వాటా ఎక్కువ ఆహారం తిన్నాడని ఆరోపిస్తూ డాబా యజమాని తన వద్ద పనిచేస్తున్న వ్యక్తిని దుస్తులిప్పేసి చితకబాదాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 178 కిలోమీటర్ల దూరంలో గల బీతుల్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

డాబా యజమానితో పాటు అతని సహాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 20 ఏళ్ల వయస్సులో ఉన్న బాదితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని మనీష్‌గా గుర్తించారు.

స్థానిక డాబాల్లో సిబ్బందికి మధ్య వివాదాలు చాలా తరుచుగా జరుగుతుంటాయి. గొడవలు కూడా అతి సాధారణం. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ డాబాలో ముగ్గురు ఉద్యోగులు 30 ఏళ్ల వ్యక్తిని చంపేశారు.

భోజనం బాగా లేదనే ఆరోపణలతో వాగ్వాదం చెలరేగి అతని హత్య కు దారి తీసింది. భోజనం కోసం అతను తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో గల కమల్ డాబాకు వెళ్లాడు. తనకు వడ్డించిన భోజనం బాగా లేదని ఫిర్యాదు చేశాడు.

దాంతో డాబాకు చెందిన ముగ్గురు ఉద్యోగులు అతనిపై దాడి చేశారు. విపరీతంగా కొట్టడంతో అతను మరణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+