గొడవ: భార్య తన వెంట రాలేదని కొడుకు తల నరికివేత

Man beheads son after quarrel with wife
ఉదయ్‌పూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని ఛోటి ఒండరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న చిన్న గొడవ తీవ్ర రూపం దాల్చి కొడుకు హత్యకు దారి తీసింది. గొడవ కారణంగా తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త తన ఆరేళ్ల కుమారుడ్ని అత్యంత దారుణంగా తల నరికి హత్య చేశాడు. సోమవారం రాత్రి నాయి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు ఛమన్ గోమేటి తన భార్యతో శనివారం గొడవపడ్డారు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా సోమవారం తన భార్యను తీసుకువచ్చేందుకు ఛమన్ తన అత్తవారింటికి వెళ్లాడు. అయితే అతని భార్య తనతో వచ్చేందుకు నిరాకరించింది. దీంతో అతని భార్య, అత్తతో నిందితుడు ఛమన్ గొడవకు దిగాడు. తన కూతుర్ను పంపించనని అతని అత్త తేల్చి చెప్పింది.

ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఛమన్ అధిక మొత్తంలో మద్యం సేవించాడు. సోమవారం రాత్రి ఛమన్ గోమేటి మద్యం మత్తులో తిరిగి తన అత్తగారింటికి వచ్చాడు. అతని మామ పక్కన నిద్రిస్తున్న తన కొడుకును పక్కకు లాగి కత్తితో అతని తలనరికాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యాడు.

నిద్రలో ఉన్న అతని మామ నిందితుడ్ని ఆపలేకపోయారని నిందితుడి భార్య కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు ఛమన్‌ను అరెస్ట్ చేశారు. ఛమన్ తన కొడుకును ఆవేశంలోనే హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+