వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బుల కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొన్నాడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఉత్తర్ ప్రదేశ్ :శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అనేది నానుడి. అక్షరాల ఈ నానుడి ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన పురాణ్ శర్మకు వర్తిస్తోంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో చిన్న ఉపాయంతో ఆయన గట్టెక్కాడు. తనకు అవసరమైన డబ్బును సమకూర్చుకొన్నాడు. కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేసుకొని మరీ ఆయన తనకు కావాల్సిన నగదును సమకూర్చుకొన్నాడు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ కు చెందిన పురాణ్ శర్మ తన కుటుంబ అవసరాలకు అత్యవసరంగా డబ్బు అవసర పడింది. చేతిలో కొత్త కరెన్సీ లేదు. పాత నగదు చెల్లుబాటు కావడం లేదు. అయితే ఆయనకు వెంటనే ఉపాయం తట్టింది. ఆ ఉపాయాన్ని అమలు పర్చాడు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తోంది. అనే దానికి పురాణ్ శర్మ అమలు చేశాడు.

 man claim to have undergone sterilisation for money

కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స చేయించుకొంటే ప్రభుత్వం రెండు వేల రూపాయాల నగదు ఇస్తోందని తెలుసుకొన్నాడు. వెంటనే కుటుంబనియంత్రణ ఆపరేషన్ కోసం తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. అయితే ఆయనకు అక్కడ నిరాశ ఎదురైంది. భార్య ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొన్న వైద్యులు ఆమెకు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయడం కుదరదని తేల్చి చెప్పారు.

వెంటనే తానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం సిద్దమయ్యాడు.వైద్యులు ఆయనకు కుుంబనియంత్రణ ఆపరేషన్ చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొన్నందుకు గాను ఆయనకు ప్రభుత్వం రెండువేల రూపాయాల నగదు ప్రోత్సాహన్ని అందించింది. ఈ విషయమై వివాదం చేలరేగింది. అయితే పురాణ్ శర్మ అంగీకారం మేరకే కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేశామని వైద్యులు వివరించారు.

English summary
an idea can chang life, this is exatly suitable for purana sharma .he is from alighad in uttarapradesh, he have no money . who has family planning operation they will get 2000 rupees from govertnament. this information get purana sharma went to hospital, for vacatamy operation, doctors conduct operation to sharma, he get 2000 rupees from the governament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X