ప్రేమ-పెళ్లి: మాంసం తింటున్నాడని విడాకులిచ్చేసింది!

మాంసం తినడంతోపాటు తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ మహిళ తన భర్తకు విడాకులిచ్చేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. ఆరేళ్ల క్రితం జైన మతానికి చెందిన రీమా, బీహార్‌కు చెందిన కరణ్‌త

అహ్మదాబాద్: మాంసం తినడంతోపాటు తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ మహిళ తన భర్తకు విడాకులిచ్చేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. ఆరేళ్ల క్రితం జైన మతానికి చెందిన రీమా, బీహార్‌కు చెందిన కరణ్‌తో ప్రేమలో పడింది. కరణ్ వృత్తి రీత్యా కంప్యూటర్ పని చేస్తుంటాడు.

రీమా డిగ్రీ చదివింది. కులాలు వేరవడంతో వీరి పెళ్లికి రీమా తల్లిదండ్రులు అంగీకరించలేదు. తల్లిదండ్రులను ఎదిరించి రీమా కరణ్‌ను పెళ్లి చేసుకుంది. అయితే కరణ్ మంచి మాంసాహారి. జైన మతస్తులు మాంసాహారానికి దూరం.

MAN EATS MEAT, WIFE SEEKS DIVORCE

వివాహామైన తర్వాత మాంసాహారం తినొద్దని కరణ్‌కు రీమా షరతు పెట్టింది. అప్పుడు కరణ్.. రీమా షరతుకు అంగీకరించాడు. అయితే అప్పుడప్పుడు బయటకు వెళ్లి నాన్ వెజ్ తిని ఇంటికి వస్తుండేవాడు. ఈ విషయంలో రీమా, కరణ్ మధ్య పలుమార్లు గొడవలు జరిగేవి. దీంతో వేధింపులు ఎక్కువ అయ్యాయి రీమాకు.

కాగా, వీరికి కవల పిల్లలు ఉన్నారు. ఈ మధ్య కాలంలో కరణ్ నాన్‌వెజ్ అధికంగా ఆరగిస్తుండటంతో తనకు విడాకులు కావాలని రీమా కోరింది. ఈ విషయంపై రీమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తానికి కరణ్, రీమా మధ్య పరస్పర ఒప్పందంతో విడాకులు తీసుకునేందుకు అంగీకారం కుదిరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+