భోజనం రుచిగాలేదని భార్యతో ఘర్షణ: భర్త ఆత్మహత్య

Man ends life after tiff over ‘tasteless dinner’
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు ఘటనలో వేర్వేరు కారణాలతో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో విషాధం నెలకొంది. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. మొదటి ఘటనలో భార్యతో గొడవ పడిన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

గోమతినగర్‌లోని వినయ్‌ఖండ్‌లో బ్రజేష్(32) తన భార్య, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, సోమవారం రాత్రి తన విధులు ముగించుకుని వచ్చిన బ్రజేష్, భోజనం బాగాలేకపోవడంతో తన భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
దీంతో మనస్తాపానికి గురైన బ్రజేష్, తన గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిని అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

మరో ఘటనలో 65ఏళ్ల ఓ ట్రాన్స్ జెండర్(హిజ్రా) కాలిన గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సరాయి అగమీర్‌లో నివాసం ఉంటున్న ఆమె మృతిని, పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో కిరోసిన్ గానీ, పెట్రోల్ గానీ లభించలేదని పోలీసులు తెలిపారు. ఆమె గదిలో వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

తనతోపాటు ఉంటున్న రానియా అనే నేపాల్‌కు చెందిన విద్యార్థి బయటికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. మరో ఘటనలో సాదత్‌గంజ్‌లోని భుయన్ దేవి ఆలయం వద్ద ఉంటున్న రామదాసు అనే వృద్ధుడు అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రామదాసు, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+