కోడలు కాపురానికి రావడం లేదని మామ ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామిలి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోడలు కాపురానికి రావడం లేదని మామ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామిలి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోడలు కాపురానికి రావడం లేదని మామ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా పరువుపోతోందని మనస్తాపానికి గురైన ఆయన.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
రాజేందర్ కుమార్(50) అనే వ్యక్తి ఈ మధ్యనే తన కుమారుడికి పెళ్లి చేశాడు. అయితే, కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు అత్తగారింట్లో ఇమడలేక పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి తీసుకురావడానికి పలుమార్లు ప్రయత్నించినా.. ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన మామ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

విషయం తెలసుకున్న పోలీసులు.. రాజేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రాజేందర్ కుమార్ కోడలు ఆమె తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది.












Click it and Unblock the Notifications