స్మార్ట్‌ఫోన్ కోసం దారుణానికి ఒడిగడ్డిన యువకుడు .!! ఏం చేశాడో తెలుసా..!!!
అహ్మదాబాద్ : సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. మనిషిలో మంచితనం మసకబారిపోయింది. అన్నీ ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉంటున్నాయి. ఇక దొంగతనాలు చేసే వారు మాత్రం చిన్న, పెద్ద అనే తేడా చూపడం లేదు. తమకు కావాల్సిన నగదు లేదా వస్తువులు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. గుజరాత్‌లో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. కానీ నిందితుడు మాత్రం నెలరోజుల తర్వాత పోలీసులకు పట్టుబడటం విశేషం.

ఫోన్ కోసం ..
చిన్న, చితక దొంగతనాలు చేసే దొంగలు వారిలో మానవత్వం అసలే ఉండటం లేదు. తమకు కావాల్సిన వస్తువు దక్కడం లేదనే ఉద్దేశంతో చంపడానికి కూడా వెనకాడటం లేదు. అహ్మదాబాద్ జిల్లా డెట్రాజ్ తాలుకాలో నెలరోజుల క్రితం హృదయ విదారకర ఘటన జరిగింది. గత నెల 2న 11 ఏళ్ల బాలుడు పునాజీ అమ్రాట్జీ ఠాకూర్ రహదారిపై వెళ్తున్నాడు. అయితే అతని చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ ఉంది. అయితే ఆ ఫోన్ విలువ రూ.4 వేలే కావడం గమనార్హం. కానీ ఫోన్‌పై ప్రవీణ్ బజానియా కన్నుపడింది. ఇంకేముంది దొంగతనం చేయాలని భావించాడు.

ఫాలో చేసి ..
ఠాకూర్ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా ప్రవీణ్ వెంబడించారు. ఎవరూ లేని చోట దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బాలుడు అరవడంతో అక్కడినుంచి పారిపోయాడు. కానీ ప్రవీణ్ మాత్రం .. బాలునిపై పగ పెంచుకున్నాడు. తనకు మొబైల్ దక్కలేదని అక్కసు పెంచుకున్నాడు. ఇంకేముంది బాలుడిని మెల్లగా వెంబడించాడు. ఎవరూ లేరని నిర్ధారించుకొని అతని నుంచి ఫోన్ లాక్కున్నాడు. తర్వాత అతని గొంతుపై కత్తితో పొడిచి .. హతమార్చాడు. అక్కడే చిన్న గుంత తవ్వి బాలుడిని పూడ్చిపెట్టాడు. అక్కడినంచి పారిపోయాడు. కానీ నెలరోజల తర్వాత పోలీసులకు చిక్కాడు.

నెలరోజులు స్విచాఫ్
బాలుడిని ఫోన్ ఎత్తుకెళ్లిన ప్రవీణ్ .. తెలివిగా వ్యవహరించారు. ఫోన్ తీసుకెళ్లాడు కానీ దానిని ఆన్ చేయలేదు. గత మంగళవారం వరకు ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. అయితే మంగళవారం రోజున ఫోన్ చార్జీంగ్ చేశాడు. దీంతో పోలీసులు అతని లోకేషన్ కనుక్కొన్నారు. అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు బాలుడిని హతమార్చావని పోలీసులు అడిగితే .. ఫోన్ కోసమని చెప్పాడు. రూ.4 వేల ఫోన్ కోసం ఓ బాలుడిని పొట్టనపెట్టుకున్నాడు ప్రవీణ్. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి పేరెంట్స్ కోరుతున్నారు.












Click it and Unblock the Notifications