అక్రమ సంబంధానికి భార్యపై ఒత్తిడితో తల్లి హత్య
చెన్నై: మరో వ్యక్తితో అక్రమ లైంగిక సంబంధం పెట్టుకోవాలని తన భార్యపై ఒత్తిడి పెట్టిందనే ఆగ్రహంతో ఓ వ్యక్తి తన కన్నతల్లిని హతమార్చాడు. ఆ తర్వాత భార్యను చంపడానికి వెళ్తున్నట్లు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని ఆక్రాడు తాలూకాలో జరిగింది.
ఆర్కాడు తాలూకా తమిరి సమీపంలోోని తామరపాక్కం గ్రామానికి చెందిన పూంగావనం (53) కుమారుడు రమేష్. అతను కూలీగా పనిచేస్తున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని రమేష్ భార్య ప్రియపై తల్లి పూంగవనం ఒత్తిడి చేసినట్లు సమాచారం.

కొద్ది రోజుల క్రితం ప్రియ తిరువణ్నామలై జిల్లా అరణిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ప్రయిను తీసుకు రావాలని రమేష్ తల్లి పుంగావనంను కోరాడు. అయితే తల్లి అందుకు నిరాకరించిందని అంటున్నారు. పూంగవనంకు పలువురు పురుషులతో అక్రమ సబంధం ఉందని, దీని గురించి ఇరుగుపొరుగువారు చెడుగా మాట్లాడడం రమేష్ విన్నాడని అంటున్నారు.
మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తుంనదే కోపంతో ఆమెపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత పారిపోయాడు. అయితే, గ్రామస్తులు పోలీసులకు ఆ సమాచారం అందించారు. దాంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications