మణిపూర్ రాజ్‌భవన్ వద్ద భారీ పేలుడు
ఇంఫాల్: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని రాజ్‌భవన్ సమీపంలో శుక్రవారం ఉదయం ఐఈడి బాంబు పేలుడు సంభవించింది. కాగా, పేలుడు ఘటనలో ప్రాణనష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు పేర్కొన్నారు.
మరికొద్ది సేపట్లో మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు జరగుతాయనగా ఈ సంఘటన చోటుచేసుకుందని, అసెంబ్లీ సమావేశాలు మాత్రం యథావిధిగా జరిగాయని వారు చెప్పారు.

కాగా, ఈ ఘటనకు బాధ్యులమని ఏ సంస్థ ప్రకటించలేదు. కొద్దిరోజుల క్రితం మణిపూర్‌లో త్రీవవాదులు జరిపిన దాడుల్లో 18మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత సైన్యం ఆపరేషన్ మయన్మార్‌లో 50మందికి పైగా మిలిటెంట్లను హతమార్చారు.












Click it and Unblock the Notifications