మన్మోహన్ సింగ్‌కు డెంగ్యూ నిర్ధారణ: ఆరోగ్యం మెరుగుపడుతోందన్న ఎయిమ్స్ వైద్యులు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్‌కు డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ప్లేట్‌లెట్స్ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వివరించారు. కాగా, 89 ఏళ్ల మన్మోహన్ సింగ్‌కు సోమవారం జ్వరం రావడం, దాన్నుంచి కోలుకున్నప్పటికీ నీరసం తగ్గకపోవడంతో బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో సెంటర్ ప్రైవేటు వార్డులో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ నితీశ్ నాయక్ నేతృత్వంలోని కార్డియాలజిస్టుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.

 Manmohan Singh diagnosed with dengue, gradually improving, says AIIMS

కాగా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు వృద్ధులని, జూలో జంతువులు కాదని మండిపడ్డారు.

కాగా, డెంగ్యూ వ్యాధి బారినపడి మన్మోహన్‌ సింగ్‌ మూడు రోజులుగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి మన్సుఖ్‌ మాండవీయ శుక్రవారం ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)వెళ్లి మాజీ ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అక్కడే ఉన్న మన్మోహన్‌ సింగ్‌ సతీమణి గురుశరన్‌ కౌర్‌ను కలిసి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

ఈ ఫొటోల్లో మన్మోహన్ సింగ్ మంచం మీద పడుకుని ఉండగా.. ఆయన భార్య పక్కన నిలబడి ఉన్నారు.అయితే కేంద్రమంత్రి తీరుపై మన్మోహన్‌ సింగ్‌ కుమార్తె దమన్‌ సింగ్‌ మండిపడ్డారు. మంత్రి తనతోపాటు ఫోటోగ్రాఫర్‌ను గదిలోకి తీసుకొచ్చినప్పుడు తన తల్లి చాలా బాధపడిందని, బయటకు వెళ్లాలని చెప్పిన ఆమె మాటలు అస్సలు వినిపించుకోలేదని అన్నారు. తమ తల్లిదండ్రుల కోరికకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు అసహనం వ్యక్తం చేశారు. 'ఆరోగ్య మంత్రి మా కుటుంబాన్ని పరామర్శించడం సంతోషంగా ఉంది. అయితే ఆ సమయంలో మా తల్లిదండ్రులు ఫోటో దిగే స్థితిలో లేరు. నా తల్లిదండ్రులు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారు వృద్ధులు. జూలో జంతువులు కాదు. అని దమన్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు.

కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడే చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం మన్మోహన్ సింగ్‌కు జ్వరం రావడం, దాన్నుంచి కోలుకున్నప్పటికీ నీరసం తగ్గకపోవడంతో బుధవారం సాయంత్రం ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన రాహుల్ గాంధీ.. దాదాపు అరగంటపాటు అక్కడేవున్నారు. మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్‌ను ఆయన కలిశారు. మన్మోహన్ సింగ్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు రాహుల్ గాంధీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+