మిస్టరీ క్రాష్ : కూలిని మిగ్ 21 ఫైటర్ జెట్... అందులోని పైలట్ అదృశ్యం

కొద్దిరోజుల క్రితం ముంబై నివాస ప్రాంతాల్లో ఒక చిన్న విమానం కూలిన ఘటన మరువకముందే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్ 21 ఫైటర్ జెట్ విమానం హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో కుప్ప కూలింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందాడు. ముందుగా పైలట్ కనిపించకపోయేసరికి కొంత అనుమానం అధికారులకు వచ్చింది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే జవాలికి సమీపంలోని పట్టజటియన్ గ్రామంలో విమానం కుప్పకూలింది.

MiG 21 crashes in HP,pilot missing

సహాయక చర్యలకోసం రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్లు రంగంలోకి దిగాయి. జరిగిన ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. బుధవారం జరిగిన ఘటనకు రెండు నెలల ముందు మరో మిగ్ 21 ఫైటర్ జెట్ విమానం జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో కూలింది. ఈ ఘటనలో పైలట్ మృతిచెందాడు. ఒకప్పుడు మిగ్ 21 ఫైటర్ జెట్ విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అత్యంత ప్రాముఖ్యమైనదిగా నిలిచింది. జరుగుతున్న ప్రమాదాలతో దీనికి ఎగిరే శవపేటిక అని పేరు సార్థకం అయ్యింది. 1963లో ఈ తరహా విమానాలు భారత వైమానిక దళంలో చేరాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+