బడ్జెట్ హైలైట్స్ : మినిమం గవర్నమెంట్ .. మ్యాక్సిమమ్ గవర్నెన్స్.. ఇది నిర్మలా మార్క్ పద్దు

న్యూఢిల్లీ : నవ భారత నిర్మాణం కోసమే ప్రజలు తీర్పిచ్చారన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2019-2020 బడ్జెట్ ప్రసంగంలో .. తమ ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరించారు. మినిమమ్ గవర్నమెంట్.. మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అని స్పస్టంచేశారు. తమ ప్రభుత్వంలో సుపరిపాలని అందిస్తామని నొక్కి వక్కానించారు. అన్నివర్గాలకు సమన్యాయం చేసి .. దేశాభివృద్ధికి పాటుపడుతున్నామని స్పష్టంచేశారు.

చాణక్య నీతి ..
బడ్జెట్ ప్రసంగంలో భాగంగా నిర్మలా సీతారామన్ చాణక్య నీతిని ప్రస్తావించారు. 'కార్య పురుష కరేనా.. లక్ష్యం సంపాదయతే' అని పేర్కొన్నారు. మానవ ప్రయత్నం కచ్చితంగా ఉంటే ఎలాంటి లక్ష్యాలనైనా పూర్తి చేయగలం అని అర్థం వచ్చేలా చెప్పారు. సంస్కరణలు చేపట్టి .. నిరంతరం శ్రమిస్తూ కొత్త ఒరవడి సృష్టించామని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా తమ సంక్షేమ పథకాలు వెళ్లాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆయుష్మాన్ భారత్‌తో దేశం ఆరోగ్య భారత్‌గా మారుతుందని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే పొల్యుషన్ నియంత్రించేందుకు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

minimum government maximum governanace says nirmala

5 ట్రిలియన్ డాలర్లు ..
గత ఐదేళ్లలో దేశం కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు నిర్మలా సీతారామన్. బీజేపీ సర్కార్ అధికారం చేపట్టికే ఆర్తిక వ్యవస్థ వృద్ధి చెందిందని గుర్తుచేశారు. దేశ ఆర్థిక వ్యవ్సత 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి 55 ఏళ్లు పట్టిందని గుర్తుచేశారు. కానీ దానిని తాము 5 ట్రిలియర్ డాలర్లు చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి 3 ట్రిలియన్ డాలర్లు చేస్తామని పేర్కొన్నారు. దీంతో భారత్ మరింత శక్తిమంత దేశంగా అవతరిస్తోందని గుర్తుచేశారు. త్వరలో అది 5 ట్రిలియన్ డాలర్లుగా చేరుతుందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+