థియేటర్లలోనే కాదు .. వెబ్ సిరీస్‌లోనూ : మోదీ బయోపిక్ రిలీజ్‌పై ఈసీ స్టే
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. నోరుజారిన నేతల ప్రచారంపై ఆంక్షలు విధించిన ఈసీ .. నేతలు, ఆయా పార్టీల ప్రచారాన్ని వెబ్ మీడియాలో కూడా చేయొద్దని స్పష్టంచేసింది. ఇప్పటికే మోదీ బయోపిక్ రిలీజ్‌ను అడ్డుకొన్ని ఈసీ .. తాజాగా వెబ్ సిరీస్ లో కూడా విడుదల చేయొద్దని హుకుం జారీచేసింది.

చాలు .. ఆపేయండి
వెబ్ సిరీస్ లో కూడా మోదీ బయోపిక్ విడుదల చేయొద్దని ఎరోస్ నౌ చానెల్ కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. మోదీ బయోపిక్ విడుదలను నిలిపివేస్తూ ఈ నెల 10న ఆదేశాలు జారీచేసింది. వెబ్ సిరీస్ కు కూడా ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టంచేసింది. అయితే ఎరోస్ నౌ ఇప్పటికే ఐదు సిరీస్ లను ప్రసారం చేసింది. దీంతో మిగతా వాటిని వెంటనే నిలిపివేయాలని .. సిరీస్ కు సంబంధించి మొత్తం కంటెంట్ మీ ప్లాట్ ఫాం నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీచేసింది.
ఈసీ అభ్యంతరం
పీఎం నరేంద్రమోదీ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో సినిమా విడుదలపై ఈసీ స్టే విధించింది. అయితే ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం .. సినిమాను ఈసీ అధికారులు చూశాక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సినిమా చూసి .. సినిమాపై అభిప్రాయాన్ని ఈసీ సోమవారం వెల్లడించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications