పండగ వేళ.. రైతులకు బంపర్ ఆఫర్!
దీపావళి పండుగకు ముందు మోదీ సర్కారు రైతులకు గుడ్ న్యూస్ అందించింది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో గోధుమ పంట కనీస మద్ధతు ధర(MSP)ను ప్రతి క్వింటాల్‌కు రూ.160 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
గోధుమకు పెరిగిన కనీస మద్ధతు ధర
ఈ పెంపుతో గోధుమ కనీస మద్ధతు ధర క్వింటాల్‌కు రూ.2,585కి చేరుకుంది. 2025-26లో గోధుమ మద్ధతు ధర రూ.2,425గా ఉంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (CACP) సిఫార్సుల ఆధారంగా 2026-27 సంవత్సరానికి ఆరు రబీ పంటల కనీస మద్ధతు ధరలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు.

ఏ పంటలకు ఎంత పెరిగింది?
కేబినెట్ ఆమోదించిన ఇతర రబీ పంటల కనీస మద్ధతు ధర పెంపు వివరాలు ఇలా:
కుసుమ (Safflower)- రూ.600 (అత్యధిక పెంపు)
మసూర్ (Lentil)-రూ.300
ఆవాలు (Mustard)-రూ.250
శనగ (Gram)-రూ.225
బార్లీ (Barley)-రూ.170
గోధుమ (Wheat)-రూ.160
గోధుమ ఉత్పత్తి లక్ష్యం
విపణీ సంవత్సరం (Marketing Year): గోధుమల విపణీ సంవత్సరం 2026-27 ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. కొనుగోళ్లు జూన్ నాటికి పూర్తవుతాయి. ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి (జూలై-జూన్) 119 మిలియన్ టన్నుల రికార్డు గోధుమ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25లో అంచనా వేసిన ఉత్పత్తి 117.5 మిలియన్ టన్నులు. గోధుమ రబీ సీజన్‌లో ప్రధాన పంట.
57 కొత్త కేంద్ర విద్యాలయాలకు ఆమోదం
వీటితో పాటు కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా సివిల్ సెక్టార్ కింద 57 కొత్త కేంద్ర విద్యాలయాలను (Kendriya Vidyalayas - KVs) తెరవడానికి ఆమోదం లభించింది.ఈ ప్రాజెక్టు కోసం రూ.5,862 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేయనున్నారు.ఇందులో 20 కేవీలు ప్రస్తుతం కేవీలు లేని జిల్లాల్లో, 14 కేవీలు ఆకాంక్షిత జిల్లాల్లో (Aspirational Districts), 4 కేవీలు వామపక్ష ఉగ్రవాద ప్రభావిత జిల్లాల్లో, 5 కేవీలు ఈశాన్య/పర్వత ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో 1,288 కేంద్ర విద్యాలయాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications