మోడీతో నేడు మోహన్ బాబు: హరికృష్ణపై కన్ను
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు బుధవారం బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే నాగార్జున, పవన్ కళ్యాణ్ మోడీని కలిసి తమ మద్దతు ప్రకటించారు. కాగా, ఎన్టీ రామారావు కూతురు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తమ పార్టీలో చేరిన నేపథ్యంలో బిజెపి నేతలు తెలుగుదేశం మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణపై కన్నేసినట్లలు తెలుస్తోంది.
రాష్ట్రంలో సొంతంగా బలపడడంపై గత కొన్నేళ్లుగా బిజెపి దృష్టి సారించింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు, తెలుగుదేశం పక్షాన ఉన్న ప్రముఖులను, తటస్థులనూ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేసింది. 2012 డిసెంబర్‌లో తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలంటూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బాలకృష్ణకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లడానికి బాలయ్య సిద్ధపడ్డారు. అయితే, చంద్రబాబు వద్దని చెప్పడంతో మానుకున్నారు.

నిరుడు ఆగస్టులో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చాలామంది సినీ ప్రముఖులతోపాటు బాలకృష్ణ కూడా నరేంద్ర మోడీని కలిశారు. "విభజనను వ్యతిరేకించడంలో హరికృష్ణ నిజాయితీగా వ్యవహరించారని, హరికృష్ణ ఒక్కరే రాజ్యసభ సభ్యత్వం వదులుకున్నారని బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు పదే పదే అంటున్నారు. ఆ రకంగా హరికృష్ణను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను ఆయన ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్, నాగార్జున కలవడం వెనుక కూడా సీమాంధ్రలో సొంతంగా బలపడాలనే ఎజెండా బిజెపికి ఉన్నట్లు తెలుస్తోంది. వెంకయ్య నాయుడు ఆహ్వానం మేరకే మోడీని కలిసినట్లు నాగార్జున స్వయంగా అంగీకరించారు.












Click it and Unblock the Notifications