'మనీ హీస్ట్' చూసి ఎంతకు తెగించార్రా.. బ్యాంకులో 17 కిలోల బంగారం దోచి.. బావిలో దాచి

గతేడాది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బ్యాంకు దోపిడీ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. మనీ హీస్ట్ సిరీస్ మాదిరి దుండగులు బ్యాంకు దోపిడీ చేసిన విధానం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. నిందితులు పక్కా ప్రొఫెషనల్ గా చోరీకి 6 నెలల ముందు నుంచే ప్లాన్ వేసుకుని అచ్చు గుద్దినట్లే అమలు చేశారు. సాక్ష్యాధారాలు పోలీసులకు చిక్కకుండా మాస్టర్ మైండ్ తో ఆధారాలన్నింటినీ ధ్వంసం చేశారు. దోచుకున్న రూ. 13 కోట్ల విలువైన బంగారాన్ని మూడోకంటికి అనుమానం రాకుండా అడవిలోని ఓ పాడుబడ్డ బావిలో భద్రపరిచారు. ఇక మనకు తిరుగులేదనుకున్నారు. కానీ ఎంత పెద్ద దొంగలముఠా అయినా చివరికి పోలీసులకు చిక్కాల్సిందే. దాదాపు ఆరు నెలలపాటు శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు ఆ గ్యాంగ్ ను కటకటాల్లోకి నెట్టారు.

దాదాపు ఐదు నెలల క్రితం కర్ణాటకలోని దావనగరె జిల్లాలో సంచలనం సృష్టించిన భారీ దోపిడీ కేసును కర్ణాటక పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నిందితుల నుంచి 17 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ. 13కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ భారీ దోపిడీకి పాల్పడ్డ ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుండగులు స్పానిష్ వెబ్ సిరీస్ మనీ హీస్ట్ చూసి ప్రేరణ పొంది.. దోపిడీకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులు తమిళనాడుకు చెందిన విజయ్ కుమార్(30), అజయ్ కుమార్(28), పరమానంద్(30)లు, కర్ణాటకకు చెందిన అభిషేక్(23), చంద్రు(23), మంజునాథ్(32)గా గుర్తించామన్నారు. ఈ దోపిడీకి మాస్టర్ మైండ్ విజయ్ కుమార్ అని ఆయనకు బేకరీ షాపు ఉందని తెలిపారు. వీరంతా పక్కా ప్లాన్ తో గతేడాది అక్టోబరు 28న జిల్లాలోని న్యామతి పరిధిలోని ఎస్బీఐ బ్యాంకులో దోపిడీకి పాల్పడినట్లు పేర్కొన్నారు.

బ్యాంక్ పైనే రివెంజ్..

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కర్ణాటక దావనగరె జిల్లాలోని న్యామతి అనే ప్రాంతంలో విజయ్ ఓ బేకరీ షాపు నిర్వహిస్తుంటాడు. అతడు 2023 మార్చిలో రూ.15 లక్షలు బ్యాంకు లోన్ అప్లై చేశాడు. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటం కారణంగా అతడి లోన్ దరఖాస్తును బ్యాంకు రిజెక్ట్ చేసింది. దీంతో విజయ్.. తన బంధువు ద్వారా లోన్ అప్లై చేయించాడు. కానీ ఆ దరఖాస్తును కూడా బ్యాంకు రిజెక్ట్ చేసింది. దీంతో ఆ బ్యాంకుపై విజయ్ పగ పెంచుకున్నాడు. ఎలాగైనా బ్యాంకు దోపిడీ చేయాలని ప్లాన్ వేశాడు.

Money Heist in Real Life Karnataka Robbers Steal 17 Kg Gold from SBH Bank

ముందుగా ఆరుగురితో ఓ టీమ్ ఏర్పాటు చేసుకున్నాడు. మనీ హీస్ట్ వెబ్ సిరీస్ ను అనేక సార్లు ఆరుగురు కలిసి చూశారు. ప్లాన్ వేశారు. దోపిడీ చేయడానికి ఎలాంటి వస్తువులు అవసరమో యూట్యూబ్ వీడియోలు చూసి సమకూర్చుకున్నారు. ఇలా ఆరు నెలల ముందే పక్కా ప్లాన్ వేశారు. శివమొగ్గ, న్యామతి ప్రాంతాల్లోని కొన్ని దుకాణాల్లో హైడ్రాలిక్ కట్టర్, గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేశారు. ఓ స్కూళ్లో తరచూ కలుసుకుని దోపిడీ ఎలా చేయాలో ప్రణాళికలు వేసేవారు.

ఇక దోపిడీ రోజు ఈ ఆరుగురు దుండగులు బ్యాంకులోకి కిటికీ ద్వారా ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ ద్వారా బ్యాంకు లాకర్ పగలగొట్టి బంగారం దోచుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా సీసీటీవీ కెమెరాలను తొలగించారు. వీడియో కెమెరాలను ధ్వంసం చేశారు. వాళ్లు వెళ్తున్న మార్గంలో కారం పొడి చల్లుకుంటూ వెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మొదట ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా అనుమానించారు. ఆరు ప్రత్యేక దళాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

దోపిడీ చేసిన బంగారాన్ని తమిళనాడు మధురైలోని ఓ పాడుబడ్డ బావిలో దాచినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత కొంత బంగారాన్ని విజయ్ బయటకు తీసి.. బంధువులు, స్నేహితుల ఖాతాల్లో జమ చేసినట్లు తేలింది. మరికొంత బంగారాన్ని గోల్ షాపుల్లో విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దోపిడీకి ఉపయోగించిన వస్తువులను ఓ చెరువులో పడేసినట్లు విచారణలో నిందితులు పేర్కొన్నారు. ఇక పోలీసులు కేసు ఛేదించడంపై ఈస్ట్రెన్ రేంజ్ ఐజీ రవికాంత్ గౌడ.. పోలీసులను అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+