రైల్లో నుంచి కిందికి కన్నబిడ్డను విసిరేసిన తల్లి

కళ్యాణికి చెందిన పూర్ణిమ సాహా అనే మహిళ నేహతి నుంచి కృష్ణానగర్ సబర్బన్ వెళ్లే రైలులో నేహతి రైల్వే స్టేషన్‌లో ఎక్కింది. రైలు నేహతి రైల్వై స్టేషన్ నుంచి కదులుతున్న సమయంలో పూర్ణిమ సాహా తన బిడ్డను రైలు పట్టాలపైకి విసిరేసింది. అది గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే ఆ పాపను కాపాడి స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కాగా సీల్దా రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ ఉత్పల్ నాస్కర్ మాట్లాడుతూ.. పూర్ణమ సాహాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఆమెకు 14ఏళ్ళ మరో కూతురు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె భర్త లాటరీ టికెట్లను విక్రయించేందుకు తారాపిత్ ప్రాంతానికి వెళ్ళినట్లు తమ విచారణలో తేల్చారు.
ఘటన పట్ల ఆమె భర్తను కూడా విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా నేహతి జిఆర్‌పి వర్గాల సమాచారం ప్రకారం ఆ మహిళ మానసిక స్థితి బాగోలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications