Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్ర మాజీమంత్రి, బెంగాల్ రాజకీయ చాణక్యుడు కన్నుమూత

తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి ముకుల్ రాయ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ వేకువజామున 1:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన కుమారుడు శుభ్రాంశు రాయ్ 'ది ఎక్స్‌ప్రెస్'కి తెలిపారు.

తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు ముకుల్ రాయ్. 1998 జనవరిలో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచీ కొనసాగుతూ వస్తోన్నారు. పార్టీ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడు. బెంగాల్ యూత్ కాంగ్రెస్ లో చేరడం ద్వారా క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారాయన. తృణమూల్ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. ఢిల్లీలో పార్టీకి కీలక నేతగా వ్యవహరించారు. 2006లో రాజ్యసభకు ఎన్నికయ్యా. రైల్వేశాఖ మంత్రిగా పని చేశారు. 2009 నుండి 2012 వరకు పార్టీ నాయకుడిగా సేవలందించారు.

Mukul Roy Former Railway Minister and once Trinamool Congress number 2 passed away in Kolkata at 71

మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ-2 ప్రభుత్వంలో షిప్పింగ్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు ముకుల్ రాయ్. 2012 మార్చిలో దినేష్ త్రివేది స్థానంలో రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 'బెంగాల్ రాజకీయాల చాణక్యుడు'గా పేరొందిన ఆయన, తృణమూల్ కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పాటు నంబర్ 2 స్థానంలో కొనసాగారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లో పార్టీ వ్యవహారాలను సమర్థంగా నిర్వహించారు. మమత బెనర్జీకి కుడిభుజంగా పేరుంది.

2011లో వామపక్షాల 34 ఏళ్ల పాలనకు ముగింపు పలికి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన తర్వాత ముకుల్ రాయ్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2015 వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ సమయంలో సీపీఎం, కాంగ్రెస్ నుండి పెద్దసంఖ్యలో తృణమూల్ లో వలసలు చోటు చేసుకున్నాయి. ఆయన ప్రభావం వల్లే పశ్చిమ బెంగాల్ లో సీపీఎం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తృణమూల్ లో చేరారని చెబుతుంటారు.

2017 నవంబర్‌లో రాయ్ తృణమూల్ కాంగ్రెస్ కు దూరం అయ్యారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ పునాదులను బలోపేతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారాయన. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకోవడంలో తనవంతు కృషి చేశారు. ఆపరేషన్ లోటస్ తో పలువురు తృణమూల్ ప్రముఖులను బీజేపీలోకి చేర్పించగలిగారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణానగర్ ఉత్తనార్త్ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు.

బీజేపీతో దూరం పెరగడంతో 2021 జూన్‌లో తిరిగి తృణమూల్‌లో చేరారు గానీ మునుపటి హోదాను పొందలేకపోయారు. డిమెన్షియా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. 2021లో బీజేపీ టికెట్‌పై గెలిచి, తర్వాత తృణమూల్‌లో చేరడంతో, 2025 నవంబర్ 13న కలకత్తా హైకోర్టు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయన్ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+