వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావూద్‌ను పట్టుకోవడం చిటికెలో పని, పాక్‌పై మరిన్ని సర్జికల్స్: రాజ్

డర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం తమకు చిటికె వేసినంత పని కాదని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం తమకు చిటికె వేసినంత పని కాదని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ విషయంలో తాము కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అతడిని పట్టుకొస్తామన్న నమ్మకం తమకు ఉందని చెప్పారు. ఆయన శుక్రవారం నాడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

<strong>దావూద్‌ను 2సార్లు కలిసిన బాలీవుడ్ నటుడు, టీ పార్టీ! 4 గంటలు గడిపాడు</strong>దావూద్‌ను 2సార్లు కలిసిన బాలీవుడ్ నటుడు, టీ పార్టీ! 4 గంటలు గడిపాడు

పాకిస్తాన్ విషయంలో తమ ప్రభుత్వ వైఖరిని కుండబద్దలు కొట్టారు. పాక్ ఆక్రమిత కాశ్మీరులో మరిన్ని సర్జికల్ దాడులు జరిగే అవకాశాన్ని తీసిపారేయలేమన్నారు. పాక్ పొరుగుదేశం అని, ఒకవేళ మంచి కోసం పాక్ మారుదామనుకున్నా ఆ దేశం మాటలు నమ్మి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా లేమన్నారు.

dawood ibrahim

అసలు అలాంటి అడుగు వేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. పాకిస్తాన్ నుంచి ఏ ఉగ్రవాద సంస్థ గానీ, ఉగ్రవాదులు కానీ భారత్ పైకి దాడి చేసేందుకు వస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని చెప్పారు. మరిన్ని సర్జికల్స్ దాడులు జరిగినా ఆశ్చర్యం లేదన్నారు.

ఇలాంటివి జరగాలని తాము కోరుకోవడం లేదన్నారు. అలాంటి పరిస్థితి ఉంటే తప్పకుండా ధీటుగా స్పందిస్తామని చెప్పారు.

<strong>హఫీజ్ సయీద్ చుట్టూ ఉచ్చు: మరో షాకిచ్చిన పాకిస్తాన్, వెనుక చైనా ఉందా?</strong>హఫీజ్ సయీద్ చుట్టూ ఉచ్చు: మరో షాకిచ్చిన పాకిస్తాన్, వెనుక చైనా ఉందా?

హఫీజ్ సయీద్ గృహ నిర్బంధం కంటితుడుపు చర్య మాత్రమే అన్నారు. నిజంగా పాక్‌కు చిత్తశుద్ధి ఉంటే అతడిని ఈ పాటికే జైలుకు పంపించేదన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దావూద్ పాక్‌లోనే తలదాడుకున్నాడని తెలుసునని, పట్టుకొని తీసుకు రావడం చిటికెలో పని అన్నారు.

జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను చైనా వెనుకేసుకు రావడాన్ని రాజ్ నాథ్ సింగ్ తప్పుబట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా.. పాక్ వాదనను సమర్థిస్తున్నా రాబోయే రోజుల్లో మన వాదనకు మద్దతిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

English summary
While Singh took a hardline towards Pakistan, he was more measured when it came to China. He refused to criticize it for repeatedly blocking the designation of another of India’s most wanted – Jaish-e-Mohammed chief Masood Azhar – as a terrorist at the United Nations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X