తమిళనాడులో మరో ఉద్యమం: ఉద్రిక్త పరిస్థితి, పళనిసామికి అగ్నిపరిక్ష!

చెన్నై: తమిళనాడులోని పుదుక్కోటై జిల్లా నెడువాసల్ గ్రామం నుంచి సహజవాయువుల నిక్షిప్తాన్ని సేకరించేందుకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వెల్లువెత్తిన నిరసనలు తారాస్థాయికి చేరాయి.

పుదుక్కోటై జిల్లాలో మొదలైన నిరసనలు ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలైనాయి. నెడువాసల్ నాడియమ్మన్ ఆలయం దగ్గర గ్రామ ప్రజలు చేస్తున్న నిరసన పోరాటాలు 14 రోజులు పూర్తి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలైనాయి.

కేంద్రం చెక్ పెడుతుందా

సహజవాయువుల కోసం కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను ఉపంసరించాలని నిరసన పోరాటం చేస్తున్న గ్రామ ప్రజలకు రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు, విద్యార్థి సంఘాలు, యువతీ యువకులు, నేతలు పెద్ద సంఖ్యలో తరలివస్తూ మద్దతు ఇస్తున్నారు.

నడిగర్ సంఘం సంపూర్ణ మద్దతు

నడిగర్ సంఘం సంపూర్ణ మద్దతు

నెడువాసల్ గ్రామ ప్రజలకు తమిళనాడు సినీరంగం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బుధవారం నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ సహజవాయువుల నిక్షప్తాన్ని సేకరించడానికి తాము ఎట్టి పరిస్థితిలో అంగీకరించమని గ్రామ ప్రజలు చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మొండికి వేస్తోందని ప్రశ్నించారు. గ్రామ ప్రజలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని, అవసరం అయితే పోరాటం చేస్తామని నడిగర్ సంఘం స్పష్టం చేసింది.

వంద గ్రామాల ప్రజల ఏకగ్రీవ తీర్మానం

వంద గ్రామాల ప్రజల ఏకగ్రీవ తీర్మానం

సహజవాయువుల నిక్షప్తాన్ని సేకరించే విషయంలో 100 గ్రామాల ప్రజల అభిప్రాయ సేకరణ నిర్వహించగా అందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గ్రామ సభలు నిర్వహించి 11 తీర్మానాలను ఆమోదించారు.

గ్రామ ప్రజల తీర్మానాలు

గ్రామ ప్రజల తీర్మానాలు

హైడ్రోకార్బన్ పథకంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ పథకాన్ని కేంద్రం ఉపసంహరించే వరకు రోజుకు ఒక గ్రామ ప్రజలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాలని, అన్నీ గ్రామాల్లోని అన్ని ఇళ్లపై నల్లజెండాలు ఎగరవేయాలని, పర్యవరణ శాఖపై కోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యాలని నిర్ణయించారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా

గ్రామసభలు నిర్వహించి వాటి తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలని, నెడువాసల్ గ్రామం నుంచి పుదుక్కోటై జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు మానవహారం నిర్వహించాలని, అన్ని పార్టీల ఎంపీలు పార్లమెంట్ లో నిరసన గళం వినినించాలని, అన్ని గ్రామాల ప్రజలు రేషన్, ఓటర్, ఆదార్ కార్డులు కలెక్టర్ కార్యాలయంలో అప్పగించి నిరసన వ్యక్తం చెయ్యాలని 100 గ్రామల ప్రజలు నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+