వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంతకు తెగించావు ఆనంద్ గిరి..? యువతి ఫోటోతో బ్లాక్ మెయిల్, అందుకే గురుజీ సూసైడ్..?

|
Google Oneindia TeluguNews

అఖిల భారతీయ అఖండ పరిషత్ అధ్యక్షులు మహంత్ నరేంద్ర గిరి మహారాజ్ సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. 8 పేజీల లేఖలో శిష్యుడు ఆనంద్ గిరి గురించిన వివరాలు ఉన్నాయి. మహారాజ్ యువతితో ఉన్న ఫోటోలతో ఆనంద్ గిరి బెదిరించే అవకాశం ఉందని అందులో రాశారు. అతను బ్లాక్ మెయిల్ చేయనుండటంతో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని అందులో రాశారు.

మానసిక సంఘర్షణ

మానసిక సంఘర్షణ

ఆనంద్ గిరి వల్ల తాను మానసికంగా ఇబ్బందికి గురవుతున్నానని మహారాజ్ గురుజీ రాసుకొచ్చారు. గురుజీ 20వ తేదీ సోమవారం చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే 13వ తేదీ కూడా చనిపోవాలని భావించినా.. అతనికి ధైర్యం చాలలేదు. ఓ యువతి ఫోటోతో తనను జతచేర్చి వైరల్ చేయాలని ఆనంద్ గిరి ప్రయత్నిస్తున్నారని తనకు సమాచారం అందిందని తెలిపారు. ఇదీ తన పరువుకు భంగం కలిగించే అంశం అవుతుందని చెప్పారు. జీవించిన రోజులు గౌరవంగా బతికానని.. కానీ తనను ఇబ్బంది గురిచేస్తారనే అంశం మనసున కుదటపడనీయలేదని చెప్పారు.

ఫోటోతో బెదిరింపులు.?

ఫోటోతో బెదిరింపులు.?

తన ఫోటో వాడొద్దు అని చెప్పడానికి ఏమీ చేయాలని అని కోరారు. ఇదీ తనను తీవ్రంగా మానసిక సంఘర్షణకు దారితీసిందని వివరించారు. తన చావుకు ఆనంద్ గిరి, ఆద్య తివారీ, సోన్ సందీప్ తివారీ కారణం అని గురుజీ లేఖలో రాశారని పోలీసులు తెలిపారు. ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారిని శిక్షించినప్పుడే తన ఆత్మ శాంతిస్తోందని వివరించారు. లేఖలో రాసిన పేర్ల ఆధారంగా ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన మఠం నిర్వహణ బాధ్యతలను బల్బీర్‌కు అప్పగించాలని కోరారు.

ముగ్గురి అరెస్ట్

ముగ్గురి అరెస్ట్


శిష్యుడు ఆనంద్ గిరిని అరెస్ట్ చేశారు. అతనిని హరిద్వార్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి ఉత్తరాకండ్ పోలీసులు సహకరించారు. సూసైడ్ నోట్‌లో గురుజీ ఆద్య తివారీ పేరు కూడా ప్రస్తావించారు. అతను హనుమాన్ ఆలయంలో పండితుడిగా పనిచేస్తున్నారు. అతని కుమారుడు సందీప్ తివారీ పేరు కూడా వినిపించింది. వీరిద్దరినీ పోలీసుల కస్టడీకి తీసుకున్నారు.

Recommended Video

Telangana Liberation Day సెప్టెంబర్ 17 విమోచనమా, విలీనమా, విద్రోహమా ? | Explained || Oneindia Telugu
భూ మాఫియా

భూ మాఫియా


అంతకుముందు ఆనంద్ గిరి తన పేరుతో కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. భూ మాఫియా పేరును ప్రస్తావించారు. దీంతో మహారాజ్ ఎలా చనిపోయారనే సందేహాలు వస్తున్నాయి. మహారాజ్ తన గదిలో ఉరి వేసుకొని చనిపోయారు. నైలాన్ తాడుతో ఉరి వేసుకున్నారని.. డోర్ తగులగొట్టేసరికి అచేతనంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే మహారాజ్ మానసికంగా ఆందోళనకు గురయ్యారని తెలుస్తోంది. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు చెబుతున్నారు.

English summary
Mahant Narendra Giri of Prayagraj's Baghambari Math wrote that he was being blackmailed by his disciple Anand Giri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X