వెంకయ్య మాట నాకు వేదం, ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సు ముగింపు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడిపై పొగడ్తల జల్లు కురిపించారు.
‘‘నాకసలు పార్లమెంట్ అంటే ఏమిటో తెలియదు. ఢిల్లీయే నాకు కొత్త. కానీ, వెంకయ్య ఉండటం వల్ల ఏ సమస్యా ఉండటం లేదు. ఆయన ఏం చెబితే నేను అదే వింటాను'' అని మోదీ అన్నారు. మూడు సందర్భాల్లో ఆయన పేరును ప్రస్తావించారు.

పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడా ఆయన వెంకయ్య పేరును ప్రస్తావించారు. అంతేకాక ‘‘నా కేబినెట్ లో సమర్థులైన నేతలున్నారు. పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన వెంకయ్య కూడా కేబినెట్ లో ఉండటం నా అదృష్టం. అద్వానీ, వెంకయ్యలాంటి పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వారి మార్గదర్శకత్వం లభించడం నాకు గర్వకారణంగా ఉంది'' అని కూడా మోడీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications