నా పని అంతా తెర వెనకే: శశికళ భర్త నటరాజన్
తాను తెర వెనక ఉండడానికే ఇష్టపడుతానని శశికళ భర్త నటరాజన్ అన్నారు. ప్రజల ముందుకు వచ్చే ఉద్దేశం తనకు లేదని స్ఫష్టం చేశారు.
చెన్నై: తాను ఎప్పడు కూడా తెరవెనుక ఉండడానికే ఇష్టపడతానని అన్నాడియంకె ప్రధాన కార్యదర్శి వీకే శశికళ భర్త నటరాజన్ అన్నారు. తమిళనాడు అధికార పార్టీలో కొనసాగుతున్నా కూడా ప్రజల ముందుకు వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.
అధికార పార్టీని శశికళ కుటుంబం హస్తగతం చేసుకుంటోందని ఆరోపణలు వస్తుండడంపై కూడా ఆయన స్పందించారు. అన్నాడియంకె కార్యకలాపాల్లో తాను ఎప్పుడూ వెనుకే నిలబడి ఉంటానని, పార్టీని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 69 జయంతి సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఈనెల 18న అసెంబ్లీలో జరిగిన గందరగోళానికి ప్రతిపక్ష డీఎంకే పార్టీనే కారణమని నటరాజన్ విమర్శించారు. అసమ్మతి నేత పన్నీర్ సెల్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. చనిపోయిన ఏనుగు చుట్టూ ఈగలు చేరిన మాదిరిగా పన్నీర్ సెల్వం పరిస్థితి తయారైందని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీని చీల్చడం ఎవరివల్లా కాదని, అలా ప్రయత్నించే వారిని పార్టీలో ఉండనిచ్చే ప్రసక్తే లేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ మరణానంతరం జయలలితను తమ కుటుంబమే కాపాడిందని, జయ లలిత మరణించే వరకు ఆమెకు అండగా నిలబడి చాలా త్యాగాలు చేసిందని ఇటీవల ఆయన అన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications