మావోల మరో ఘాతుకం: చెరలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌‌ని కాల్చి చంపారు

రాయపూర్: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్‌ జిల్లా పామల్వాయలో మావోయిస్టుల చెరలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను హత్య చేశారు. బుధవారం నాడు జవాన్‌ను మావోయిస్టులు అతిదారుణంగా కాల్చిచంపారు. మావోయిస్టులు హత్య చేసిన ఈ జవాన్‌ని తొమ్మిది రోజుల క్రితం కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.

Naxals kill BSF jawan in Chhattisgarh

ఒడిశాలో ఏడుగిరిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా మత్తిలి సమితి కర్తన్‌పల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున మత్తిలి సమితి మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత త్రినాథ భుమియాతో సహా ఏడుగురిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సరిగ్గా ఏడాది క్రితం కూడా ఈ ప్రాంతం నుంచి ముగ్గురిని కిడ్నాప్ చేసిన మావోలు ఇద్దరిని హతమార్చి ఒకరిని విడిచి పెట్టారు.

ఇటీవలే ఛత్తీస్‌ఘడ్‌లో మూడు రోజుల్లో మావోయిస్టులు నాలుగు సార్లు దాడులు చేసి 16 మంది భద్రతా సిబ్బందిని హత్య చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గెరిల్లా యుద్ధ పోరాటవ్యూహంతో మావోలు దంతేవాడ, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో చెలరేగిపోతున్నారు.

హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారమే ప్రతి ఏడాది వెయ్యికిపైగా మావోయిస్టు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభావిత రాష్ర్టాల్లో 2009లో 2,258 ఘటనలు జరిగాయి. 2010లో 2,213, 2011లో 1,759, 2012లో 1,415, 2013లో 1,129 ఘటనలు జరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+