వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..! : మోడీ స్థానమేంటి..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఈ రెండేళ్లలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు వాటి అమలు తీరు గురించి విస్తృత స్థాయిలో జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది బీజేపి. సంక్షేమం అభివృద్ది ప్రాతిపదికనే ప్రజలు ఆయా పార్టీలకు మార్కులు వేస్తారు కాబట్టి, జనంలో మైలేజ్ కోల్పోకుండా ఉండేందుకు బీజేపీ తన కార్యాచరణ రూపొందించుకుంటుంది.

ఇకపోతే, మోడీ అధికారంలోకి వచ్చాక జరిగిన ఎన్నికల్లో మొన్నటి అసోం మినహా ఢిల్లీ, బీహార్ వంటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బ తిన్నది. దీంతో రానున్న రోజుల్లో మోడీ ప్రభ ఎలా ఉండబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఇదే పాయింట్ పై ఫోకస్ చేసిన ఏబీపీ న్యూస్ ఐఎంఆర్బీ అంతర్జాతీయ సంస్థలు దీనిపై సంయుక్తంగా సర్వేను నిర్వహించాయి.

ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే మోడీ మేనియా ఎంతవరకు పనిచేస్తుంది, బీజేపీ ఎన్ని స్థానాలను దక్కించుకుంటుంది అనే అంశాలపై ఆసక్తికర ఫలితాలను వెల్లడించాయి సర్వే సంస్థలు. 2014 ఎన్నికల్లో 45 శాతం ఓట్లను దక్కించుకున్న బీజేపీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 342 స్థానాలను బీజేపీ దక్కించుకుంటుందని సర్వేలో వెల్లడైంది. అంటే గత ఎన్నికల్లో 45 శాతం ఓటు బ్యాంకు ఉన్న బీజేపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 52 శాతం ఓట్లను సొంతం చేసుకుంటుందని పేర్కొంది.

NDA to triumph with 342 seats if elections were held today; Narendra Modi most popular leader: ABP News IMRB survey

సర్వే వెల్లడించిన విషయాల ప్రకారం.. భవిష్యత్తులో బీజేపీకి పంజాబ్ లో ఎదురుదెబ్బ తప్పదని, అదే సమయంలో అసోం, ఓడిశా సహా తూర్పు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కానుందని తెలపడం గమనార్హం. దీని ప్రకారం గత లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే, తూర్పు రాష్ట్రాల్లో బీజేపీ ఓటు బ్యాంకు 29 శాతం నుంచి 38 శాతం పెరగుతుందని పేర్కొంది.

ప్రస్తుతం దేశంలో 47 శాతం మంది ప్రజలు మోదీని ప్రధానిగా అంగీకరిస్తున్నారని పేర్కొన్న సర్వే, 49 శాతం మంది ఆయన పనితీరుకు కితాబిచ్చినట్టుగా తెలియజేసింది.

English summary
NDA government seems to be riding high after completing two years in power as it seems to be getting 342 seats if elections were held today, predicts the opinion poll conducted by ABP News IMRB International. This is a slight gain in the number of seats against its tally of 339 in 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X