తెలుగు తెరపై ఎప్పుడూ చేయని క్యారెక్టర్ లో స్టార్ హీరో

మాచోస్టార్ గోపీచంద్ నటిస్తోన్న లేటెస్ట మూవీ.. భరతవర్ష- సాగా ఆఫ్ శూల. ఆయన నటిస్తోన్న 33వ సినిమా ఇది. ఈ హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ మూవీకి సంకల్ప్ రెడ్డి దర్శకుడు. రీతూ వర్మ కథానాయిక. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. దీని టైటిల్ గ్లింప్సెస్ ఇదివరకే విడుదల అయ్యాయి. ఈ సినిమా 642 ఏడీ నాటి శూల రాజ్యానికి మనల్ని తీసుకెళ్లినట్టనిపించిందీ గ్లింప్సెస్ చూస్తోంటే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ వెల్లడి కావొచ్చు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా టైటిల్‌ను ప్రకటించింది. గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఓ వారియర్ గా అతని క్యారెక్టర్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చింది. అద్భుతమైన యాక్షన్ దృశ్యాలతో సాగుతుందీ 55 సెకెండ్ల నిడివి ఉండే టైటిల్ గ్లింప్సెస్. భరతవర్ష ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేశారు.

Vvenkat Makes Directorial Debut in Gopichand s 34th Film Promising High-Octane Action Mythic Visuals

ఈ మూవీ ఇంకా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గోపీచంద్. ఆయన 34వ చిత్రం పట్టాలెక్కింది కూడా. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. మెగా ఫోన్ పట్టనున్నారు. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి సినిమా. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంటెంట్ బేస్డ్ చిత్రాలను అందించే ఈ నిర్మాణ సంస్థ.. గోపీచంద్ ఫిల్మ్ ను భారీ బడ్జెట్‌తో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందిస్తోంది.

ఈ మూవీ పేరు ఇంకా ఖరారు కాలేదు. కొద్దిసేపటి కిందటే పూజా కార్యక్రమాలు ఆరంభం అయ్యాయి. గోపీచంద్ పై క్లాప్ కొట్టారు. శనివారమే ఈ చిత్ర అనౌన్స్‌మెంట్ జరిగింది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ గూస్ బంప్స్ తెప్పించింది. మండుతున్న నారింజ ఆకాశం, ప్రజ్వలించే సూర్యుడు, ఒక రాతి కొండపై నిల్చుని ఉన్న చిరుతతో కూడిన పోస్టర్ ఇది. ఫైట్ మాస్టరే దర్శకుడు కూడా కావడం వల్ల యాక్షన్ సన్నివేశాలు హైవెలాసిటీలో ఉండొచ్చనే అంచనాలు ఏర్పడ్డాయి.

షామ్‌దత్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించనున్నాడు. శామ్ సీ ఎస్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఆకట్టుకునే కథాంశం, అనుభవజ్ఞులైన సాంకేతిక బృందం, భారీ నిర్మాణ విలువల కారణంగా గోపీచంద్ 34వ చిత్రం ఆయన కెరీర్‌లో మరో మోస్ట్ పవర్ ఫుల్ మూవీగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+