ఎన్డిటివి సర్వే అంచనా: మోడీ కూటమికి మెజారిటీ
న్యూఢిల్లీ: బిజెపి నేత నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని ఎన్డిటివీ సర్వే తెలియజేస్తోంది. బిజెపి నాయకత్వంలోని ఎన్డియే కూటమికి లోకసభలో స్పష్టమైన మెజారిటీ వస్తుందని అంచనా వేసింది. నరేంద్ర మోడీకి ప్రధాని పీఠం కట్టబెట్టడంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కీలక భూమిక పోషిస్తున్నట్లు వెల్లడైంది. ఎన్డియెకు 279 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ప్రభుత్వం ఏర్పాటుకు 272 స్థానాలు సరిపోతాయి.
ఎన్డీటివి సర్వే ప్రకారం - ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 సీట్లలో బిజెపి 56 సీట్లు వస్తాయి. గత ఎన్నికల్లో బిజెపి కేవలం పది సీట్లు మాత్రమే గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీకి కేవలం 12 సీట్లు మాత్రమే వస్తాయి. బహుజన్ సమాజ్ పార్టీకి ఐదు సీట్లు వస్తాయి. ఈ రెండు పార్టీలు గత ఎన్నికల్లో 20యేసి సీట్లకు పైగా గెలుచుకున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బిఎస్పీ వెనకంజ ప్రభావం యుపిఎపై పడే ప్రమాదం ఉంది. కాంగ్రెసు 79 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇంత దారుణంగా కాంగ్రెసు గతంలో ఎప్పుడూ లేదు. కాంగ్రెసు నేతృత్వంలోని 103 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో యుపిఎ 257 సీట్లు గెలుచకుంది.

బిజెపికి 235 సీట్లు వస్తాయని అంచనా. మిత్రపక్షాలతో కలిసి 279 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మాహారాష్ట్రలో ఎన్డియె కూటమి జాక్‌పాట్ కొట్టే అవకాశం ఉంది. ఐదు పార్టీల కూటమి 48 సీట్లలో 34 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా గణనీయంగా ఎన్డియె సీట్లు సాధించే అవకాశం ఉంది.
బీహార్‌లోని 40 సీట్లలో 20 ఎన్డియె సాధిస్తుందని అంచనా. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జెడి కూటమి 14 సీట్లు సాధించే అవకాశం ఉంది. తమిళనాడులో జయలలిత నాయకత్వంలోని అన్నాడియంకె 32 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఆమె నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తే ఎన్డియె బలం 300 మైలు రాయి దాటుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని రెండు సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications