దాచలేదు, పిరికివాడ్ని కాను: యాంకర్‌తో అఫైర్‌పై డిగ్గీ
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మాదిరిగా తాను పరికివాడిని కానని, టీవీ యాంకర్ అమృతా రాయ్‌తో సంబంధాన్ని తాను దాచలేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. తన భార్య విషయాన్ని నరేంద్ర మోడీ 30 ఏళ్లు దాచి పెట్టారని ఆయన అన్నారు. టీవీ జర్నలిస్టుతో తన సంబంధం వ్యక్తిగతమని, అయినా తన సంబంధాన్ని దాచిపెట్టలేదని ఆయన అన్నారు. నిన్ననే ఆ విషయం వెల్లడించినట్లు ఆయన తెలిపారు.
అమృతా రాయ్‌కు విడాకులు లభించిన వెంటనే తాము పెళ్లి చేసుకుంటామని, ఆమెతో తన వివాహం విషయంలో ఎటువంటి విమర్శలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలనని దిగ్విజయ్ సింగ్ అన్నారు. నరేంద్ర మోడీ చట్టాలను ఉల్లంఘించే వ్యక్తి అని ఆయన అభివర్ణించారు. పోలింగు రోజున ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం అందుకు నిదర్శనమని ఆయన అన్నారు.

మేడే సందర్భంగా గాంధీభవన్‌లోని ఐఎన్‌టియుసి పతాకను ఆయన గురువారం ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో ఆహార భద్రతా బిల్లును కార్పోరేట్ సంస్థలు వ్యతిరేకించాయని, అయితే అవే కార్పోరేట్ సంస్థలు మోడీని సమర్థిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ పదేళ్లో తమ పార్టీ పాలనలో దేశంలో ఆర్థిక వృద్ధి రేటు సాధ్యమైందని చెప్పారు.
విభజన తర్వాత రెండు రాష్ట్రాలు కూడా దేశంలో అగ్ర స్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోని అంశాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. దేశసంపదకు కార్మికుల కృషే కారణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications