నన్ను అవమానించారు: మోడీకి నితీశ్ ఓపెన్ లెటర్

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన బుధవారం ఆయన ట్విట్టర్‌లో ఒక బహిరంగ లేఖను పోస్ట్ చేశారు.

ప్రధాని చేసిన వ్యాఖ్యలతో తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతిందని, తన వ్యాఖ్యలతో బీహార్ ప్రజలను కూడా మోడీ అవమానించారని లేఖలో ఆరోపించారు. తన వ్యాఖ్యలను మోడీ వెనక్కి తీసుకోకపోతే బీహర్ ప్రజలను క్షమించరని అన్నారు.

Nitish writes open letter to Modi, hits out at PM's 'DNA barb'

మోడీ చేసిన వ్యాఖ్యలు తమలో చాలా మందిని బాధ కలిగించాయని నితీశ్ కుమార్ పేర్కొన్నారు. తాను బీహార్ బిడ్డనని... బీహార్ ప్రజల డీఎన్ఏ, తన డీఎన్ఏ ఒకటేనని లేఖలో తెలిపారు. తన డీఎన్ఏ గురించి మాట్లాడి, బీహార్ ప్రజలను మోడీ అవమానించారని అన్నారు.

గత నెలలో బీహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ, నితీష్‌పై విమర్శలు చేశారు. జితన్ రాం మాంఝీ లాంటి మహాదళితుడిని అవమానించడం ద్వారా నితీష్ కుమార్ తనను కూడా అవమానించారని ప్రధాని మోడీ విమర్శించారు. నితీష్ డీఎన్ఏలోనే ఏదో లోపం ఉన్నట్టుందని అన్నారు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ మోడీకి ట్విట్టర్ ద్వారా లేఖ రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+