వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌పీఆర్‌పై అమిత్ షా అటెన్షన్... ఎన్‌పీఆర్‌కు ఎన్‌ఆర్‌సీకి సంబంధం లేదు

|
Google Oneindia TeluguNews

కేంద్రం తాజాగా అమోదించిన [ఎన్‌పీఆర్ } నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ , మరియు ఇటివల అమోదం పొందిన [ఎన్ఆర్‌సీ ] నేషనల్ రీజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కు సంబంధం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కాగా ప్రభుత్వం అమోదించిన ఎన్‌పీఆర్ పై కూడ పలు అందోళనలు , అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో దాన్ని అమలు చేయవద్దని ప్రతిపక్షలు నిరసనలు చేపట్టాయి.

ఎన్‌ఆర్‌పీ పై మరో ఆందోళన

ఎన్‌ఆర్‌పీ పై మరో ఆందోళన

కాగా ఇప్పటికే కేంద్రం మూడు వివాదస్పద చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే...ఈ నేపథ్యంలోనే సీఏఏ , ఎఆర్‌‌సీ , ఇప్పుడు ఎన్పీఆర్ ..ముఖ్యంగా అమోదించిన సీఏఏ మరియు ఎన్ఆర్‌సీ పై దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్పీఆర్‌కు కేంద్రం అమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలోనే రానున్న సంవత్సరం నుండి జనన పట్టిక అయిన ఎన్పీఆర్‌ను అప్‌డేట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయడంతో మరిన్ని ఆందోళనలు ప్రారంభమయ్యాయి.

ముందస్తుగా రంగంలోకి దిగిన అమిత్ షా

ముందస్తుగా రంగంలోకి దిగిన అమిత్ షా

దీంతో కేంద్రహోంమంత్రి అమిత్ షా ముందస్తుగానే రంగంలోకి దిగారు. సీఏఏను తీసుకువచ్చిన వెంటనే ఈశాన్య భారతంలో మొదలైన ఆందోళనలు ఉత్తరాధి రాష్ట్రాలను సైతం అతలాకుతం చేశాయి. అవి నెమ్మదిగా దక్షిణాది రాష్ట్రాలను సైతం తాకాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో చెలరేగిన హింసాత్మక సంఘటనల్లో ఇరవైకి పైగా పౌరులు మృత్యువాత పడ్డారు. దీంతో అలాంటీ ఆందోళనలు ఎన్పీఆర్ విషయంలో జరగకుండా అమిత్ షా ఏఎన్‌ఐకి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. ఇంటర్యూలో ఎన్‌ఆర్‌పీ, ఎన్‌ఆర్‌సీ సంబంధం లేదని , ఎన్‌ఆర్‌పీతో ఎలాంటీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

2010లో మొదటి ఎన్‌ఆర్‌పీ

ఎన్పీఆర్ అనేది దేశ జనాభా గణించేందుకు మాత్రమే తీసుకువచ్చామని చెప్పారు. దీని ద్వార కేవలం దేశ జనాభాను తెలుసుకోవడం కోసం తీసుకువచ్చామని చెప్పారు. ఇందులో దేశపౌరులా ... కాదా అనే అంశమే ఉండదని పేర్కొన్నారు. కాగా ఎన్పీఆర్ విధానాన్ని 2010లోనే యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందని, అప్పుడు దాన్ని ఎవరు ప్రశ్నించలేదని అన్నారు. కాని ఇప్పుడు మాత్రం ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌పీఆర్‌కి ఎన్‌ఆర్‌సీ ఎలాంటీ సంబంధం లేదని స్పష్టం చేశారు.

జాతీయ భద్రత కోసమే ఎన్‌ఆర్‌పీ

జాతీయ భద్రత కోసమే ఎన్‌ఆర్‌పీ

కాగా 2010లో తీసుకువచ్చిన ఎన్పీఆర్‌ను 2015లో ఓసారి అప్‌డేట్ చేశారు. కాగా తిరిగి దీన్ని 2020 ఏప్రిల్ నుండి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం సుమారు నాలుగు వేల కోట్ల రూపాయను విడుదల చేశారు. కాగా దేశ అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న ఈ ప్రక్రియలో ప్రజలందరి వేలి ముద్రలు సేకరించడం, అందరికీ పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇవ్వడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సమర్థంగా చేరవేయడమే దీని లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. కోసం ఎటువంటి పత్రాలు అవసరం లేదనీ.. సెల్ఫ్ సర్టిఫికెట్ ఇస్తే చాలని మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ స్పష్టంచేశారు. బయో మెట్రిక్‌ వివరాలు, ఆధార్ సహా ఎటువంటి పత్రాలూ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎన్‌ఆర్‌సీకి దీనికి ఎలాంటి సంబంధమూ లేదని తేల్చి చెప్పారు

English summary
Union home minister Amit Shah on Tuesday categorically stated that there is no link between the processof National Population Register (NPR) and (NRC).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X