30 సెకన్లు మాస్క్ తీయాల్సిందే, ఎంపీ సర్కార్ నయా రూల్.. ఎందుకో తెలుసా..?
కరోనా.. కరోనా... కరోనా.... ఎక్కడ చూసినా ఒక్కటే భయం. కరోనా పేరు చెబితే చాలు వణికిపోవాల్సిందే. ఇక వైరస్ నిర్మూలన కోసం బ్రహ్మాస్త్రం మాస్క్ ధరించాల్సిందే. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. మాస్క్ తీసేయాలని.. అయితే కొన్ని సెకన్లపాటు రీమూవ్ చేయాలని కోరింది. కానీ పబ్లిక్ ప్లేసుల వద్ద మాత్రమే కాసేపు తీసి.. మళ్లీ పెట్టుకోవాలని స్పష్టంచేసింది.
కరోనా వైరస్ వల్ల అంతా మాస్క్ వేసుకొని వస్తున్నారు. ఇందులో దొంగ ఎవరో, దొర ఎవరో తెలియడం లేదు. దీంతో బ్యాంకులు, బంగారు దుకాణాల వద్దకు వచ్చేవారిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలా వస్తోన్న వారి ఫోటోలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నది. ప్రతీ ఒక్క వినియోగదారుడు 30 సెకన్లపాటు మాస్క్ తీసి.. ఫోటో దిగిన తర్వాత మళ్లీ మాస్క్ పెట్టుకొని వెళ్లేందుకు అనుమతిచ్చింది.

దీంతో బ్యాంకు, జువెల్లరీ షాప్‌నకు వచ్చే విజిటర్స్ సీసీటీవీల్లో వారి ఫోటోలు తీసుకుంటారు. దీంతోపాటు పరిసర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. వచ్చినవారు ఎవరో గుర్తించడం సులభం అవుతోంది. క్రైం రేట్ కూడా తగ్గుతోందని అధికారులు భావిస్తున్నారు. అయితే మాస్కులతో బ్యాంకుల్లోకి ప్రవేశించే వారిని గుర్తించడం కష్టంగా మారుతోందని బ్యాంకు అధికారులు కూడా చెబుతున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications