నెక్ట్స్ టార్గెట్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్: బిన్ లాడెన్ గతే
న్యూఢిల్లీ: భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ దాడులు అద్బుతమని, ఇక భారత్ నెక్ట్స్ టార్గెట్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కావాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు.
పాకిస్థాన్ కు మొట్టమెదటి సారిగా చెప్పుదెబ్బ లాంటి గట్టి సమాధానం చెప్పామని, అందుకు భారత్ ఆర్మీని అభినందిస్తున్నానని తెలిపారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన పాకిస్థాన్ పై ఘాటుగా విమర్శించారు. ఆయన తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టనట్లు మాట్లాడారు.

పంది ఎదుట ముత్యాలు
పాకిస్థాన్ తో చర్చించడం అంటే పంది ఎదుట ముత్యాలు చల్లడం లాంటిదని బాబా రాందేవ్ ఘాటు గా విమర్శించారు. పాకిస్థాన్ ఎప్పుడూ అబద్దాలకోరేనని అన్నారు. పాక్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

ఖననం చేశారు, తరువాత నాటకాలు
సర్జికల్ స్ట్రైక్ దాడులలో అంతం అయిన ఉగ్రవాదుల శవాలను ట్రక్కుల్లో వేరే ప్రాంతాలకు తీసుకు వెళ్లి ఖననం చేశారని బాబా రాందేవ్ అన్నారు. తరువాత దాడులు జరిగిన ప్రాంతానికి అంతర్జాతీయ మీడియాను తీసుకు వెళ్లి ఇక్కడ ఏమీ జరగలేదని డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు.

అన్ని సాక్షాలు ఉన్నాయి
భారత ప్రభుత్వం దగ్గర సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన అన్ని సాక్షాలు, గట్టి ఆధారాలు, వీడియో ఫుటేజీలు ఉన్నాయని గుర్తు చేశారు. అయితే దాన్ని బయట పెట్టడం అనేది మన వ్యూహాలకు సంబంధించిన విషయం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని, రాజకీయ పార్టీల నాయకుల డిమాండ్లను పట్టించుకోనవసరం లేదని అన్నారు.

ఇమ్రాన్ ఖాన్ పిచ్చికుక్క
భారత్ సర్జికల్ దాడులకు దీటుగా స్పందిస్తామని ఇమ్రాన్ ఖాన్ లాంటి రాజకీయ కుక్కలు మాట్లాడుతున్నాయని, భారత్ ను ఎదుర్కొనే సత్తా మీకు ఉందా ? అని సూటిగా ప్రశ్నించారు.

పాకిస్థాన్ కు చందాలు పంపిద్దాం
పాకిస్థాన్ యువతరాన్ని చదవించడానికి భారతీయులు కొద్దిగా విరాళాలు ఇవ్వాలని, కనీసం వాళ్లకు అక్షరాస్యత వస్తే ఉగ్రవాద భూతం నుంచి తప్పించుకుంటారని చెప్పారు. అప్పుడైనా ఉగ్రవాదుల సంఖ్య తగ్గితే పాక్ కు బుద్ది వస్తుందని బాబా రాందేవ్ అన్నారు.

అవి మనకు వద్దు
చైనా ఉత్పత్తులను భారతీయులు బహిష్కరించాలని బాబా రాందేవ్ పిలుపునిచ్చారు. ఆ ఉత్పత్తుల వలన మనకు అన్యాయం జరుగుతుందని, చైనా ఎప్పటికైనా భారత్ కు వెన్ను పోటు పొడవడానికి వెనుకాడదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

బిన్ లాడన్, దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్
అమెరికా ఒసామా బిన్ లాడెన్ ఎలా అంతం చేసిందే మనం కూడా అలాగే దాడులు చేసి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అంతర్జాతీయ ఉగ్రవాది మఫీజ్ సయీద్ ను అంతం చెయ్యాలని అన్నారు. వారిద్దరిని ప్రాణాలతో పట్టుకోనవసరం లేదని, వారికి విముక్తి కలిగించి పైకి పంపిస్తే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని బాబా రాందేవ్ చెప్పారు.

బూట్లు నాకేవాళ్లు
పాకిస్థాన్ కు బూట్లు నాకేవాళ్లు, తమను పొగుడుతూ పిచ్చి పాటలు పాడేవారు కావాలని, వేరే వారిని పాక్ ఎప్పటికీ స్వాగతించదని బాబా రాందేవ్ చెప్పారు.

ఆయనకు ఎందుకు
పాకిస్థాన్ నటీనటులు ఉగ్రవాదులు కాదని సల్మాన్ ఖాన్ అంటున్నారు. అవును నాకు ఒక డౌట్ పాక్ తారలను ఎవరు ఉగ్రవాదులు అన్నారు అని ప్రశ్నించారు. సల్మాన్ ఖాన్ కు నిజంగా దేశభక్తి ఉంటే పాక్ వెళ్లి భారతీయ సినిమాల మీద నిషేదం ఎత్తివేయించాలని బాబా రాందేవ్ సవాలు విసిరారు.
-
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
లీటర్ పెట్రోల్ రూ. 321, కిరోసిన్ రూ. 433, డీజిల్ రూ. 345.. ఎమర్జెన్సీ ప్రకటన.. -
Pakistan: ఏప్రిల్ 4 నుంచి లాక్ డౌన్..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!










Click it and Unblock the Notifications