'సాధ్వీ రిజైన్ చేయరు', లేట్ వస్తే.. ఎంపీలకు మోడీ మరో షాక్!

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి వ్యాఖ్యల పైన ప్రతిపక్షాలు బుధవారం కూడా ఆందోళన కొనసాగించాయి. దీని పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. నిరంజన్ జ్యోతి రాజీనామా చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఉభయ సభల్లో సాధ్వి ఇప్పటికే క్షమాపణలు చెప్పారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో సాధ్వి క్షమాపణలు చెప్పారన్నారు.

బుధవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే సాధ్వి వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. సాధ్వి రాజకీయాలకు కొత్త అని, ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్నారు.

గతంలోనూ యూపీఏ హయాంలో వాజ్‌పేయిపై ఓ మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. క్షమాపణ చెప్పేందుకు అప్పట్లో ఆ మంత్రి నిరకరిస్తే ప్రధాని మన్మోహన్‌ సింగ్ సభకు క్షమాపణ చెప్పారని వెంకయ్య వివరించారు. అయితే సాధ్వి రాజీనామాకు విపక్షాలు పట్టుబట్టాయి. వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

No question of Sadhvi's resignation, says Venkaiah Naidu

తెలంగాణ రాష్ట్రం వచ్చాక 350 మంచి రైతులు చనిపోయారు: ఎంపీ పొంగులేటి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 350 మంది రైతులు మరణించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లోకసభలో వెల్లడించారు. తీవ్రమైన కరవు, కరెంట్ కోతలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. పంటలు పండినా మద్దతు ధర లభించడం లేదని, అగ్రికల్చర్ ఎమర్జెన్సీ ప్రకటించి తెలంగాణ రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఆలస్యమైతే ప్రవేశం నిషిద్ధం: బీజేపీ ఎంపీలకు నరేంద్ర మోదీ షాక్

బహిరంగ ప్రసంగాల్లోనే కాక మాటతీరులోనూ జాగ్రత్తగా ఉండాలని పార్టీ ఎంపీలకు, నేతలకు సూచించిన ప్రధాని నరేంద్ర మోడీ.. తాజాగా సమయపాలన కూడా పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.

ఆలస్యంగా వచ్చిన వారిని సమావేశ మందిరంలోకి అనుమతించవద్దని ఆయన తన సిబ్బందికి సూచించారు. తొలుత ఈ నిబంధన పార్టీ పార్టమెంటరీ భేటీల్లో అమలులోకి వచ్చేసింది. దీంతో మంగళవారం నాడు ఏకంగా 20మంది ఎంపీలు ఈ భేటీ జరిగిన బాలయోగి ఆడిటోరియం ముందు బయటే తచ్చాడుతూ తిరగాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+