కోర్టును దిక్కరించిన మంత్రి: నాన్ బెయిలబుల్ వారెంట్లు
లక్నో: నేను మంత్రిని తనను ఎవరు ఏమి చేస్తారులే అని నిర్లక్ష్యం చేసిన మంత్రికి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. మంత్రిగారితో పాటు 32 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి యాసీర్ షాకు ఈ వారెంట్లు జారీ అయ్యాయి.
పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2007 సంవత్సరం లో ఒక వ్యక్తి భారీగా మత్తు మందులు సేకరించి పెట్టుకున్నాడని యాసీర్ షా తెలుసుకున్నారు. తరువాత అతనిని యాసీర్ షా గృహ నిర్బంధం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
మంత్రితో పాటు పోలీసు అధికారుల మీద ఆరోపణలు వచ్చాయి. నాన్పరా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుండి కేసు విచారణ జరుగుతున్నది. అయితే మంత్రి యాసీర్ షాతో పాటు ఆరోపణలు ఎదుర్కోంటున్న వారు కేసు విచారణకు సక్రమంగా హాజరు కాలేదు.

కేసు విచారణ కుంటుపడుతున్న దృష్ట్యా న్యాయస్థానం వీరికి సమన్లు జారీ చేసింది. అయినా వీరు లెక్క చెయ్యలేదు. సమన్లును సైతం ధిక్కరించిన మంత్రిపై శుక్రవారం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బర్ బాంకీ సర్వజీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మే 12వ తేదికి కేసు విచారణ వాయిదా వేశారు. మంత్రిని కోర్టు ముందు హాజరు పరచాలని నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. మే 12వ తేది లోపు మంత్రిని కోర్టు ముందు హాజరు పరుస్తామని లక్నో ఎస్పీ బరాచి ఆర్.ఎల్. వర్మా తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications