గత 40ఏళ్లుగా చైనాపై ఒక్క బుల్లెట్ పేల్చలేదు: మోడీ
గత 40సంవత్సరాల్లో తీవ్ర సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రష్యా పర్యటనలో ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సెయింట్‌పీటర్స్‌బర్గ్: గత 40సంవత్సరాల్లో తీవ్ర సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రష్యా పర్యటనలో ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం ఏదైనా మా సరిహద్దులవద్ద అతిక్రమణలకు ఆక్రమణలకు శాంతికి ఏమాత్రం విఘాతం కలిగించి నా భారత్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు.
'మాకై మేము కయ్యానికి కాలుదువ్వం.. మాది శాంతి కాముక దేశం' అని మోడీ అన్నారు. ఓబీఓర్ (వన్ బెల్ట్ వన్ రోడ్ - చైనా పాక్ ఎకనమిక్ కారిడార్) ప్రాజెక్టు భారత్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని చెబుతూ కార్యక్రమానికి హాజరు కాకపోవడం పై ఎదురైన ప్రశ్నకు.. 'చైనాతో మాకు సరిహద్దు వివాదం ఉన్న మాట నిజమే. కానీ గత 40 ఏళ్లుగా సరిహద్దు వివాదం కారణంగా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు' అని సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనమిక్ ఫోరమ్‌లో మోడీ సమాధానమిచ్చారు.

ఒకప్పటిలా అమెరికా పంచనో లేక సోవియట్ యూనియన్ పంచనో దేశాలు చేరే కాలం పోయిందని అన్నారు. నేడు ప్రతి దేశం మిగిలిన ప్రపంచ దేశాలతో స్నెహపూరిత సత్సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు. కొద్ది దేశాలతో సమస్యలు ఉన్నా సంబంధాలు మాత్రం చెడిపోవడం లేదని అన్నారు. అందుకు దేశాలమధ్య పెనవేసు కుంటున్న 'విపణి-వ్యాపార' ధోరణే కారణమని చెప్పారు.
భారత్-రష్యాల మధ్య ఉన్న సంబంధం నమ్మకంతో కూడుకున్నదని చెప్పారు. ఎన్నో కఠిన సమయాల్లో కూడా ఈ సంబంధం చెడిపోలేదని తెలిపారు. భారత్-రష్యాల మధ్య కుదిరిన 'సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్' గురించి ప్రస్తావిస్తూ.. ఒప్పందంలో ఉన్న ప్రతి అక్షరాన్ని ప్రపంచదేశాలు పరిగణలోకి తీసుకుంటాయని తనకు తెలుసునని చెప్పారు.












Click it and Unblock the Notifications