షాక్: కారుతో ఢీకొట్టి, కిలో మీటర్ ఈడ్చుకెళ్లాడు

ఢిల్లీ: గత నెల 28వ తేదీన గుర్గావ్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. హోండాకారు నడుపుతున్న ఓ డ్రైవర్ ఎదురుగా వస్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. కారు ఢీకొన్న వెంటనే ఆ వ్యక్తి కారు ముందుభాగంపై పడ్డాడు. అక్కడున్న వారు తనను కొడతారని హోండా కారు డ్రైవర్ భయపడ్డాడు.

దీంతో, అక్కడి నుంచి కారును వేగంగా పోనిస్తూ సుమారు కిలోమీటర్ వరకు అలాగే కారు డ్రైవర్.. బాధితుడిని ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు.

ప్రతీక్ కుమార్ తన మూడేళ్ల బాబుతో కలిసి మార్చి 28వ తేదీన సాయంత్రం ఆరు గంటల సమయంలో బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో ఎదురుగా హోండా కారు వచ్చింది. ఆ కారు ప్రతీక్ కుమార్‌ను ఢీకొట్టింది.

On Camera, Man Dragged By Runaway Driver After Fight On Gurgaon Road

తనను ఢీకొట్టినప్పటికీ కారు డ్రైవర్ అలాగే పోనిచ్చాడని, తనను కిలోమీటర్ దూరం కారు లాక్కెళ్లిందని చెప్పాడు. పాత ఢిల్లీ రోడ్డు మార్గంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఈ సంఘటన జరిగిందని చెప్పాడు.

దాదాపు కిలో మీటర్ వరకు వెళ్లిన తర్వాత కారు నుంచి కింద పడ్డానని, ఆ వెంటనే మరో వాహనం తనను తాకడంతో గాయపడ్డానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు ప్రమాదం జరిగిన ఘటనను వీడియో రూపంలో సాక్షాన్ని అందించేందుకు ఆ ప్రాంతంలోని దుకాణాలలో విచారణ చేసి మరీ బాధితుడు ఫలితాన్ని పొందాడు. బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+