బెంగళూరులో పట్టపగలు ట్రాఫిక్ సిగ్నల్ లో షూట్ ఔట్
బెంగళూరు: బెంగళూరు నగరంలో పట్టపగలు రద్దీగా ఉండే ప్రాంతంలో తుపాకితో కాల్పులు జరిపి హత్య చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే నిందితుల దాడి నుంచి ఎపీఎంసీ అధ్యక్షుడు కడబలె శ్రీనివాస్ ప్రాణాలతో భయటపడ్డారు.
శుక్రవారం మద్యాహ్నం 12 గంటల సమయంలో బెంగళూరు నగర శివార్లోని యలహంక దగ్గర ఉన్న కూగిలు క్రాస్ ట్రాఫిక్ సిగ్నల్ లో ఎపీఎంసీ అధ్యక్షుడు కడబలె శ్రీనివాస్ కారులో ఉన్నారు. ఆ సమయంలో పల్సర్ బైక్ లో వచ్చిన ఇద్దరు నిందితులు రివాల్వర్ తో కారు మీద కాల్పులు జరిపారు.

శ్రీనివాస్ ను హత్య చెయ్యడానికి ప్రయత్నించారు. సమీపంలో ఉన్న పోలీసులు కారు దగ్గరకు వస్తున్న విషయం గుర్తించిన నిందితులు అక్కడి నుంచి బైక్ లో పరారైనారు. ఒక్క సారిగా సిగ్నల్ లో కాల్పులు జరపడంతో స్థానికులు ఆందోళనతో పరుగు తీశారు. పాతకక్షల కారణంగా శ్రీనివాస్ ను హత్య చెయ్యడానికి ప్రయత్నించారని పోలీసులు అంటున్నారు. కేసు విచారణలో ఉంది.












Click it and Unblock the Notifications