పహల్గాం రక్తానికి వెల కట్టిన భారత్-ఆపరేషన్ సింధూర్‌తో పాక్ పై మెరుపుదాడి!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం దీటుగా స్పందించింది. అమాయకుల ప్రాణాలను బలిగొన్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల అంతు చూసేందుకు 'ఆపరేషన్ సింధూర్' పేరుతో బుధవారం, మే 7న పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించింది.

పహల్గాం విషాదం తర్వాత దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆగ్రహావేశాల నేపథ్యంలో భారత సాయుధ బలగాలు ఈ కీలక చర్యను చేపట్టాయి. అత్యంత పక్కా ప్రణాళికతో చేపట్టిన ఈ ప్రెసిషన్ స్ట్రైక్స్‌లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

operation-sindoor-live-updates-in-telugu-india-retaliates-targeting-terrorist-camps-in-pakistan

భారత్‌పై దాడులను ప్లాన్ చేస్తూ, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత్ జరిపిన మెరుపుదాడులకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్

May 07, 2025, 4:54 pm IST

కచ్చితమైన సమాచారంతోనే ఉగ్రస్థావరాలపై దాడి: రాజ్‌నాథ్ సింగ్
May 07, 2025, 4:53 pm IST

హనుమంతుడినే ఆదర్శంగా తీసుకుని దాడులు చేశాం: రాజ్‌నాథ్ సింగ్
May 07, 2025, 4:53 pm IST

అమాయకులను చంపిన వారినే మట్టుబెట్టాం: రాజ్‌నాథ్ సింగ్
May 07, 2025, 4:52 pm IST

శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పాం: రాజ్‌నాథ్ సింగ్
May 07, 2025, 4:11 pm IST

ముంబై క్రాస్ మైదాన్‌లో మాక్ డ్రిల్ నిర్వహణ
May 07, 2025, 4:10 pm IST

హైదరాబాదులో ప్రారంభమైన మాక్ డ్రిల్. బస్టాండ్లు, రైల్వేస్టేషన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో మాక్ డ్రిల్
May 07, 2025, 3:57 pm IST

రాష్ట్రపతిని కలిసి ఆపరేషన్ సింధూర్‌ను వివరించిన ప్రధాని మోదీ
May 07, 2025, 3:56 pm IST

కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడి తర్వాత ప్రతీకార చర్య కోసం దేశం ఎంతో ఎదురుచూసిందన్న ప్రధాని
May 07, 2025, 3:55 pm IST

ఆపరేషన్ సింధూర్‌ను స్వాగతిస్తున్నాం: మల్లికార్జున ఖర్గే
May 07, 2025, 3:39 pm IST

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో ప్రస్తుత భద్రతా పరిస్థితిపై చర్చించేందుకు సమావేశమయ్యారు.
May 07, 2025, 3:37 pm IST

ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్ ప్లాట్‌ఫాం 7&8లో మాక్ డ్రిల్ నిర్వహించిన అధికారులు
May 07, 2025, 3:24 pm IST

కేంద్రం ఆదేశాలతో మాక్ డ్రిల్‌కు ఆపరేషన్ అభ్యాస్ అని పేరు పెట్టడం జరిగింది: సీవీ ఆనంద్
May 07, 2025, 3:22 pm IST

జీహెచ్ఎంసీ పరిధిలో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్
May 07, 2025, 3:22 pm IST

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్

సైరన్ మోగిన సమయంలో ఇంట్లో ఉన్నవారు ఇంట్లోనే ఉండాలి, లైట్లను ఆర్పివేయాలి.
May 07, 2025, 3:20 pm IST

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రెస్‌మీట్

మరి కాసేపట్లో హైదరాబాదులో మాక్ డ్రిల్. సరిగ్గా 4 గంటలకు 2 నిమిషాల పాటు మోగనున్న సైరన్
May 07, 2025, 1:26 pm IST

భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు,ఇతర నేతలు.
May 07, 2025, 1:20 pm IST

మరణించిన వారిలో అజార్ అక్క, ఆమె భర్త, అతని మేనల్లుడు, అతని భార్య, మరొక మేనకోడలు, అతని కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉన్నారని వార్త ప్రచారంలో ఉంది
May 07, 2025, 1:18 pm IST

పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లో భారత దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సహాయకులు మరణించారని జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ చెప్పినట్లు సమాచారం
May 07, 2025, 11:00 am IST

లక్ష్యాలన్నిటినీ చాలా జాగ్రత్తగా పూర్తి చేశాం. కేవలం ఉగ్రవాదులను వారు నడిపే శిక్షణా శిబిరాలను మాత్రమే లక్ష్యంగా దాడులు నిర్వహించాం: వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
May 07, 2025, 10:53 am IST

ఇంటెలిజెన్స్ సంస్థలు స్పష్టమైన సమాచారం ఇచ్చాకే.. ఉగ్రవాద శిబిరాలను గుర్తించి అవే లక్ష్యంగా దాడులు నిర్వహించాం:వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
May 07, 2025, 10:52 am IST

9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించి వాటిని ధ్వంసం చేయడం జరిగింది.ఈ శిబిరాలు పీఓకేతో పాటు పాకిస్తాన్‌లో ఉన్నాయి: వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
May 07, 2025, 10:51 am IST

పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకార చర్యే ఆపరేషన్ సింధూర్: కల్నల్ సోఫియా ఖురేషీ
May 07, 2025, 10:49 am IST

విదేశాంగ శాఖ కార్యదర్శి: విక్రమ్ మిస్రీ

పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారింది.ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ఎప్పుడూ పాక్ ప్రయత్నించలేదు.. ఆ దిశగా అడుగులు వేయలేదు
May 07, 2025, 10:48 am IST

జరిగిన మారణహోమం గురించి మోదీతో చెప్పాలంటూ ఉగ్రవాదులు చెప్పడం అత్యంత దారుణమైన విషయం. జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటక రంగం తిరిగి విరాజిల్లుతుండటంతో పాకిస్తాన్ ఈ దుశ్చర్యకు పాల్పడింది: విక్రమ్ మిస్రీ
May 07, 2025, 10:45 am IST

విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

ఉగ్రవాదంను అణిచివేసే హక్కు కలిగిఉన్న భారత్ ఆమేరకు చర్యలు తీసుకుంది
May 07, 2025, 10:44 am IST

విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా ఇంకా ప్రోత్సహించే ధోరణే కనిపించింది
May 07, 2025, 10:43 am IST

విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

పహల్గాం ఘటన తర్వాత భారత ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే ఈ మెరుపు దాడులు
May 07, 2025, 10:42 am IST

విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరాల ప్రకారం పహల్గాం ఉగ్రవాదులను భారత ఏజెన్సీలు గుర్తించడం జరిగింది
May 07, 2025, 10:41 am IST

ఏప్రిల్ 22వ తేదీన పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రమూకలు పహల్గాంలో 26 మందిని కాల్చి చంపారు. కుటుంబ సభ్యుల ఎదుటే కాల్చి చంపారు.: విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
May 07, 2025, 10:38 am IST

ఆర్మీ నుంచి మహిళా ఉన్నతాధికారి కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేన నుంచి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు మీడియా సమావేశంలో మాట్లాడతారు
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+