పాకిస్తాన్‌పై పాశుపతాస్త్రం- 2 గంటల్లో సమూల విధ్వంసం: ఆర్మీ అధికారిక ప్రకటన
India Pakistan War: అంచనాలకు తగ్గట్టే- పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి దిగింది. వైమానిక దాడులు సాగించింది. బుధవారం తెల్లవారు జామున ఈ దాడులు చేపట్టింది. శతృదేశం ఊపిరి సలపనివ్వలేదు భారత్. ఏకధాటిగా మిస్సైళ్లను సంధించింది. ఈ మిషన్‌కు భారత్ పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారమే ఈ యుద్ధం. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నా ఉగ్రవాదులు. ఈ ఘాతుకానికి పాకిస్తాన్ కారణమంటూ మొదటి నుంచీ భారత్ వాదిస్తూ వచ్చింది. యుద్ధ సన్నాహకాలనూ చేపట్టింది.

దశాబ్దాల కాలంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, భారత్‌లో అలజడులకు కారణమౌతోన్న పాకిస్తాన్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పాలంటూ దేశ ప్రజల సైతం తమ ఆకాంక్షించారు. పాకిస్తాన్‌ను మట్టుబెట్టడానికి ఇదే సరైన సమయం అంటూ కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు.
ఫలితంగా- ప్రత్యక్ష యుద్ధానికి దిగింది భారత్. తెల్లవారు జామున 2 గంటల సమయంలో చిక్కటి చీకటిని చీల్చుకుంటూ తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి.
ఈ వైమానిక దాడిని పాకిస్తాన్ ధృవీకరించింది. మొత్తం 24 ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులు సాగించినట్లు ఆ దేశ ఆర్మీ అధికారికంగా వెల్లడించింది. తెల్లవారు జామున 4 గంటలకు పాక్ మిలటరీ అధికార ప్రతినిధి, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మొత్తం 24 ప్రదేశాలపై భారత్ దాడులు చేసిందని, ఎనిమిది మంది మరణించినట్లు వెల్లడించారు. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషె మహ్మద్‌కు గట్టి పట్టు ఉన్న బహవాల్‌పూర్, ముజఫ్ఫరాబాద్, కొట్టి ప్రాంతాల్లో భారత్ దాడులు సాగించినట్లు చెప్పారు. జైషె ఉగ్రవాదులు హబ్‌గా చెప్పుకొనే బహవాల్‌పూర్ అహ్మద్‌పూర్ ఈస్ట్‌లో ఉండే సుభాన్ మసీద్ పూర్తిగా ధ్వంసమైనట్లు వెల్లడించారు.
అలాగే- ముజఫ్ఫరాబాద్‌లో బిలాల్ మసీదు, సియాల్‌కోట్‌లో మురిడ్కె, కోట్కి, షక్కర్‌ఘర్‌పై భారత్ వైమానిక దాడులు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు ముగ్గురు సాధారణ పౌరులు మరణించారని, పలువురు గాయపడ్డారని అహ్మద్ షరీఫ్ చౌధురి చెప్పారు.












Click it and Unblock the Notifications