పార్లమెంట్: కేంద్రానికి నిలదీత, గిఫ్ట్ అని ఆజాద్ సెటైర్
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ధరల పెరుగుదల పైన లోకసభ, రాజ్యసభల్లో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. లోకసభలో ధరల పెరుగుదలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
స్పీకర్ పోడియం వద్దకు విపక్ష సభ్యులు చేరి చుట్టు ముట్టారు. సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభాపతి సభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు.

రాజ్యసభలో మాజీ కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ధరల పెరుగుదల పైన చర్చను ప్రారంభించారు. కొత్త ప్రభుత్వం కానుకగా ధరలను పెంచిందని ఆజాద్ ఎద్దేవా చేశారు. ద్రవ్యోల్భణంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే ధరలను ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించారు.
కాగా, ఈ నెల 8వ తేదీన రైల్వే బడ్జెట్, 9న ఆర్థిక సర్వే, 10న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఆగస్టు 14వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications