వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ ఇంట్లో పనిచేస్తే 'అమ్మ' అయిపోతారా: శశికళపై పన్నీరు

జయలలిత ఇంట్లో పని చేసిన వాళ్లంతా అమ్మ అయిపోతారా? అనితమిళనాటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సోమవారం నాడు అన్నారు. శశికళ ఏం మాట్లాడినా పన్నీరు సెల్వం కౌంటర్ ఇస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జయలలిత ఇంట్లో పని చేసిన వాళ్లంతా అమ్మ అయిపోతారా? అని
తమిళనాటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సోమవారం నాడు అన్నారు. శశికళ ఏం మాట్లాడినా పన్నీరు సెల్వం కౌంటర్ ఇస్తున్నారు.

సీన్ రివర్స్: ఆత్మరక్షణలో పన్నీరు, మోడీకి శశికళ షాక్!సీన్ రివర్స్: ఆత్మరక్షణలో పన్నీరు, మోడీకి శశికళ షాక్!

ఇందులో భాగంగా తాజాగా, ఆయన శశికళ చేసిన కుట్ర వ్యాఖ్యల పైన తీవ్రంగా స్పందించారు. పన్నీర్‌ పార్టీని చీల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని, అలాంటి వాళ్లను వెయ్యి మందిని చూశామని శశికళ అన్నారు.

దీనిపై పన్నీరు వెంటనే ఎదురు దాడికి దిగారు. అమ్మ ఇంట్లో ఎంతోమంది పని చేశారని, వారంతా అమ్మ అయిపోతారా? ఇది తమిళనాడు ప్రజలు ఎప్పటికీ ఆమోదించరని దుయ్యబట్టారు. దాదాపు మూడు దశాబ్దాలుగా శశికళ, జయలలితతో కలిసి ఉన్న విషయం తెలిసిందే.

OPS counter to Sasikala

శశికళకు మెజారిటీ ఉంది: సుబ్రహ్మణ్య స్వామి

తమిళనాడు ముఖ్యమంత్రి పదవీ ప్రమాణస్వీకారంపై భాజపా సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మరోసారి తన గళం వినిపించారు. శశికళకు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడు సీఎంగా ప్రమాణస్వీకారానికి ఆహ్వానించక, ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

శశికళ ఎఫెక్ట్: స్టాలిన్‌కు చేదు అనుభవం, పన్నీరు కోసం వేచి చూసి మరీ..శశికళ ఎఫెక్ట్: స్టాలిన్‌కు చేదు అనుభవం, పన్నీరు కోసం వేచి చూసి మరీ..

రాష్ట్రంలోని రాజకీయ అనిశ్చితిపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. శశికళకు ఎమ్మెల్యే మద్దతు ఉందని, దీనికి సంబంధించి ఆమె తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందించారు.

అవసరమైతే బల నిరూపణకు సిద్ధంగా ఉన్నారని, పన్నీర్‌సెల్వం మాత్రం తనకు మద్దతుగా నిలుస్తున్నవారి గురించి ఏ ఒక్క పేపర్‌నూ సమర్పించలేదని చెప్పారు. అలాంటప్పుడు గవర్నర్‌ ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.

English summary
In a fresh salvo against interim Chief Minister O Panneerslevam, AIADMK chief VK Sasikala equated him to the “dust on her palm” and said she could handle him easily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X