ఫిర్యాదుల్లో వెనుకే: వ్యభిచారంలో మోడల్స్, జూఆర్టిస్ట్‌లు

న్యూఢిల్లీ/హైదరాబాద్: నేరాల విషయంలో జాతీయస్థాయిలో నాలుగో స్థానంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్... దానిపై ఫిర్యాదు నమోదు చేయడంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. వివిధ నేరాలపై అత్యధికంగా మహారాష్ట్ర పోలీసులకు 17.99 లక్షల ఫిర్యాదులు అందితే, 2.65 లక్షల ఫిర్యాదులతో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో నిలిచింది.

జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) 2013కు సంబంధించి విడుదల చేసిన గణాంకాల్లో అనేక నేరాలలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా హత్యలు, ఆర్థిక నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు అత్యధికంగా నమోదయింది. దేశవ్యాప్తంగా 2.34 లక్షల నేరాలోత మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. 2.18 లక్షల నేరాలతో ఏపీ నాలుగో స్థానంలో ఉంది.

ఇదిలా ఉండగా.. అత్యధిక వ్యభిచారం కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం... దేశంలోనే రెండో స్థానంలో ఉందని పోలీసుల నివేదిక ద్వారా వెల్లడైన విషయం తెలిసిందే. వ్యభిచార కూపంలో జూనియర్ ఆర్టిస్టులు, మోడల్స్ తదితరులు ఉంటున్నారు.

నేరాలు

నేరాలు

2013లో భారతదేశంలో నమోదైన 20శాతం కేసులు ఉమ్మడి రాష్ట్రానివే కావడం గమనార్హం. ఈ వివరాలను నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో డేటా వెల్లడించింది.

నేరాలు

నేరాలు

అత్యధిక వ్యభిచారం కేసులతో తమిళనాడు రాష్ట్రం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ నగరంతోపాటు విజయవాడ, విశాఖపట్నంలలో అత్యధిక సంఖ్యలో వ్యభిచారం కేసులు నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది.

నేరాలు

నేరాలు

భారతదేశంలో మొత్తం 2,541 వ్యభిచార కేసులు నమోదవగా అందులో 549 కేసులతో తమిళనాడు రాష్ట్రం అగ్రస్థానంలో ఉండగా.. 489 కేసులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.

 నేరాలు

నేరాలు

ఇప్పటికీ హైదరాబాద్‌లో తరచూ సెక్స్ రాకెట్ల గుట్టు విప్పుతున్నారు పోలీసులు. నగరంలోని ఉన్నత వర్గాలకు చెందిన వారు, టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్టులు, మోడల్స్ ఇందులో భాగస్వాములవుతున్నారు.

నేరాలు

నేరాలు

ధనవంతులైన వ్యాపారవేత్తలు, సంపన్నులు వారి సేవలను వినియోగించుకుంటున్నారు. హోటళ్లు, రిసార్ట్స్‌తో వ్యభిచారం చేయిస్తున్నారు.

నేరాలు

నేరాలు

సెక్స్ రాకెట్ నిర్వాహకులు వారి వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు ఇంటర్నెట్‌లో వివిధ వెబ్‌సైట్లలో ప్రకటనలు కూడా ఇవ్వడం గమనార్హం.

 నేరాలు

నేరాలు

గత రెండు వారాల్లోనే నాలుగు సెక్స్ రాకెట్లను పోలీసులు ఛేదించారు. 10 మంది మహిళలను కాపాడారు. ఇందులో టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్టులే ఉన్నారు. ముంబైకి ఓ మోడల్ కూడా పట్టుబడింది.

 నేరాలు

నేరాలు

విశాఖ, విజయవాడ నగరాల్లో కూడా వ్యభిచారం కేసులు అత్యధికంగా పెరిగిపోయాయి. 2012లో విశాఖలో 19 కేసులు, విజయవాడలో 34 కేసులు నమోదవగా.. అవి 2013లో 34, 50 కేసులకు పెరిగాయి.

నేరాలు

నేరాలు

భారత దేశంలో గత ఏడాది మొత్తం 33,707 అత్యాచారాలు జరుగగా, వాటిలో అత్యధిక అత్యాచారాలు 4,335 ఒక్క మధ్యప్రదేశ్‌లోనే జరిగాయి. అత్యాచారాల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.

నేరాలు

నేరాలు

ద్వితీయ స్థానంలో రాజస్థాన్ నిలిచి 3,285 మంది అమ్మాయిల మానప్రాణాలతో ఆడుకుంది. 3,063 రేపులతో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచింది.

నేరాలు

నేరాలు

ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో అరాచకాలు బాగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఉత్తరప్రదేశ్ 3,050 మానభంగాలతో నాలుగోస్థానంలో ఉందని జాతీయ నేర గణాంకాల నివేదిక వెల్లడించింది.

 నేరాలు

నేరాలు

వ్యభిచారం కేసుల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా... అత్యాచారాల్లో నాలుగో స్థానంలో ఉంది. హత్యలు, అత్యాచారాల్లో హైదరాబాదు ముందంజలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+