‘పద్మ’ అవార్డులు ప్రకటించిన కేంద్రం, ఇళయరాజాకు ‘పద్మ విభూషణ్’
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి గురువారం సాయంత్రం కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది.
Recommended Video

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2018కి చెందిన పద్మ అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి గురువారం సాయంత్రం కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది.
9 మందికి పద్మభూషణ్, 73 మందికి పద్మశ్రీ, ముగ్గురికి పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించారు. పద్మ విభూషణ్ దక్కించుకున్న వారిలో మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్కరిని పద్మ అవార్డు లభించింది. తెలంగాణలో ఎవరికీ అవార్డు దక్కలేదు. ఏపీ నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ కు పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.
పద్మశ్రీ అవార్డు పొందిన వారిలో... మహారాష్ట్రకు చెందిన శాస్త్రవేత్త అరవింద్ గుప్తాకు, కేరళకు చెందిన లక్ష్మీకుట్టికి, ఎం.ఆర్ రాజగోపాల్‌కు, కర్ణాటకకు చెందిన సలగత్తి నరసమ్మకు, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన యేషి ధోడెన్‌కు వైద్యరంగంలో పద్మశ్రీని కేంద్రం ప్రకటించింది.

ఇంకా.. మధ్యప్రదేశ్‌కు చెందిన భజ్జు శ్యామ్‌కు కళారంగంలో పద్మశ్రీ ఇవ్వనున్నట్టు పేర్కొంది. బెంగాల్‌కు చెందిన సుధాన్షు బిశ్వాస్‌కు సేవారంగంలో, బెంగాల్‌కు చెందిన సుభాషిని మిస్త్రీకి సామాజిక సేవలో, సాహిత్య రంగంలో విజయలక్ష్మీకి పద్మశ్రీని అందించనున్నారు.
తమిళనాడుకు చెందిన రాజగోపాలన్ వాసుదేవన్‌కు, మహారాష్ట్రకు చెందిన మురళీకాంత్ పటేకర్ పద్మశ్రీని ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. మరికాసేపట్లో పద్మ అవార్డులపై కేంద్రం అధికారిక ప్రకటన చేయనుంది.
'మ్యూజిక్ మేస్ట్రో' ఇళయ రాజాకు 'పద్మ విభూషణ్'...
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను తాజాగా కేంద్ర ప్రభుత్వం 'పద్మ విభూషణ్' అవార్డుతో సత్కరించింది. తమిళనాడు రాష్ట్రంలోని పన్నైపురంలో జన్మించిన ఇళయరాజా దాదాపు 5 వేల పాటలకు సంగీతం అందించారు. 2010లో కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 2018లో ఇళయరాజాకు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది.
సినీ సంగీతానికి చేసిన కృషికిగాను ఇళయరాజా 2012లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2014లో శ్రీ చంద్రసేకరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం, 2015లో గోవాలో జరిగిన 46వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియాలో జీవితకాల సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications