Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భావ ప్రకటనకు దారేది?:‘పద్మావతి’ వాయిదా కారణాలివేనా.. అందుకేనా బెదిరింపులు

చరిత్ర వక్రీకరణ పేరిట భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

న్యూఢిల్లీ : వివాదాస్పదమైన సంజయ్‌ లీలా బన్సాలీ బాలీవుడ్‌ చిత్రం 'పద్మావతి' విడుదలను కొన్ని హిందూ శక్తుల బెదిరింపులకు భయపడి నిరవధికంగా వాయిదా వేయడం పట్ల సోషల్‌ మీడియాలో ముఖ్యంగా, ట్విట్టర్‌లో మిశ్రమ స్పందన వస్తోంది. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆందోళన సద్దుమణుగుతోందని ఆ పార్టీ ప్రభుత్వమే భరోసా ఇవ్వడంతోనే పద్మావతి విడుదలను వాయిదా వేసుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

చదవండి: పద్మావతి సినిమా విషయంలో జోక్యం చేసుకోలేం: సుప్రీం కోర్టు షాక్

గుజరాత్‌ అసెంబ్లీ

గుజరాత్‌ అసెంబ్లీ

గుజరాత్‌ అసెంబ్లీకి డిసెంబర్‌ 9, 14 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓ రాజకీయ పార్టీ లబ్ధి పొందడం కోసమే కొన్ని హిందూ శక్తులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోందని విమర్శలు వినవస్తున్నాయి.
కొంత మంది దీన్ని హిందూ శక్తుల విజయమని వ్యాఖ్యానిస్తుండగా, ఎక్కువ మంది ఇది ప్రజాస్వామ్యానికి ఓటమని, ముఖ్యంగా భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతమని వ్యాఖ్యానిస్తున్నారు. భారత యావత్‌ చలనచిత్ర పరిశ్రమ సంఘటితంగా నిలబడి ఉంటే నేడు ‘పద్మావతి'కి ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇందుకు చలనచిత్ర పరిశ్రమకు చెందిన వారంతా సిగ్గుతో తలదించుకోవాల్సిందేనని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇష్టారీతిన ఇతరులను అవమానించేలా నడుచుకోవచ్చా అనే చర్చ కూడా సాగుతోంది.

జనవరి నుంచే ‘పద్మావతి’ వ్యతిరేక ఆందోళనలు ఇలా

జనవరి నుంచే ‘పద్మావతి’ వ్యతిరేక ఆందోళనలు ఇలా

గోవాలో అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం (ఇఫీ)లో ప్రదర్శించే భారతీయ సినిమాల జాబితా నుంచి ఎస్‌. దుర్గా, న్యూడ్‌ చిత్రాలను కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు తొలగించడం పట్ల వివాదం రాజకున్న తరుణంలోనే పద్మావతి వివాదం తారాస్థాయికి చేరుకుంది. పద్మావతి సినిమా షూటింగ్‌ జరుగుతుండగానే గత జనవరి నెలలో సినిమాకు వ్యతిరేకంగా కొన్ని హిందూ శక్తులు ఆందోళనలు నిర్వహించాయి. సినిమా షూటింగ్‌ సెట్‌లను దగ్ధం చేయడం దగ్గరి నుంచి పద్మావతి దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీని తల నరికిన వాడికి పది కోట్లు హిస్తామని, పద్మావతిగా సినిమాలో నటించిన దీపికా పదుకొణె ముక్కు కోసిన వ్యక్తికి కోటి రూపాయలు, ఆమెను నిలువున తగులబెట్టిన వ్యక్తికి మరో కోటి రూపాయలు ఇస్తామని బెదిరిస్తూ వచ్చాయి. స్వయంగా అధిరాన బీజేపీ ఎమ్మెల్యేనే ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం గమనార్హం.

కేంద్ర మంత్రి ఇరానీ మౌనమెందుకు?

కేంద్ర మంత్రి ఇరానీ మౌనమెందుకు?

ఇలాంటి బెదిరింపులను సినీ పరిశ్రమ సంఘటితంగా ఎదుర్కోక పోవడం వల్లనే నేడు పద్మావతి సినిమా విడుదలను నిలిపివేయాల్సి వచ్చిందని, ఇది నిజంగా గూండాల విజయమని ఎక్కువ మంది ట్వీట్లు చేస్తున్నారు. ఇంతటి బెదిరింపులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం ఏమిటని, ముఖ్యంగా సినిమా పరిశ్రమ పట్ల ఆసక్తి చూపించే కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి స్మ్రుతి ఇరానీ వంటి వారు కూడా బాలీవుడ్‌ నటి పదుకొనేను అంతగా బెదిరిస్తున్నా ఎందుకు మాట్లాడడం లేదని ట్వీటర్లు ప్రశ్నిస్తున్నారు.

‘టైగర్ జిందా హై’ పరిస్థితేమిటన్న ఆందోళన

‘టైగర్ జిందా హై’ పరిస్థితేమిటన్న ఆందోళన

కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల హామీ వల్లే ‘పద్మావతి' నిర్మాతలు వెనక్కు తగ్గి తర్వాత విడుదల చేయాలని సంకల్పించినా సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘టైగర్‌ జిందా హై' సినిమా డిసెంబర్‌ 22వ తేదీన విడుదల కావాల్సి ఉందని, ఆ సమయంలో పద్మావతి విడుదలయితే తమకు ఇబ్బంది అవుతుందని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మావతి స్థానంలో అంటే, డిసెంబర్‌ ఒకటవ తేదీన ‘టైగర్‌ జిందా హై' చిత్రం విడుదలకు చర్యలు తీసుకోవాలని వారు ఆ సినిమా నిర్మాతలను కోరుతున్నట్లు తెల్సింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+