పద్మావతి సినిమా విషయంలో జోక్యం చేసుకోలేం: సుప్రీం కోర్టు షాక్
పద్మావతి సినిమా విడుదలను నిలుపుదల చేయాలన్న పిటిషనర్లకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో సోమవారం చుక్కెదరయింది.
న్యూఢిల్లీ: పద్మావతి సినిమా విడుదలను నిలుపుదల చేయాలన్న పిటిషనర్లకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో సోమవారం చుక్కెదరయింది.
ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ, హీరోయిన్ దీపికా పదుకొణేలకు హెచ్చరికలు వస్తున్నాయి. తమకు ఆరాధ్యమైన పద్మావతిని కించపరిస్తే ఊరుకునేది లేదని కర్ణి సేన చెబుతోంది.

ఈ నేపథ్యంలో సినిమా విడుదలను నిషేధించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పద్మావతి చిత్రం విడుదలపై నిషేధం విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. సెన్సార్ బోర్డుకు ఉన్న అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. సిబిఎస్సీ ఇంకా సర్టిఫికేట్ ఇవ్వలేదని, అలాంటప్పుడు విడుదలను ఎలా ఆపేస్తామని ప్రశ్నించింది.
సినిమాకు సీబీఎఫ్సీ సర్టిఫికేట్ రావాల్సి ఉందన్నారు. కాగా, పద్మావతి సినిమా విడుదలపై నిషేధం విధించాలంటూ అడ్వోకేట్ ఎంఎల్ శర్మ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications