ఎదురుకాల్పులు: ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సోమవారం తెల్లవారుజామున పహల్గామ్ వద్ద సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. వాటిని భద్రతా బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి.
ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి మూడు ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నుంచీ ఉగ్రవాదులకు తెగుబడుతుండగా, భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి.

ముగ్గురు ఉగ్రవాదులు హతమవడంతో ఆపరేషన్ పూర్తయినట్లు భద్రతాదళాధికారులు చెప్పారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. కొందరు ఉగ్ర మద్దతుదారులు ఆ ఉగ్రవాదులను రక్షించేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications