దాడులను లైవ్ లో చూశాం.. మసీదులపై బాంబులు.. రాత్రంతా.. పాకిస్థాన్ ప్రత్యక్ష సాక్షి సంచలన వీడియో

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ ను తాము ప్రత్యక్షంగా చూశామని పాకిస్థాన్ కు చెందిన కొందరు వ్యక్తులు తెలిపారు. అర్థరాత్రి 12 గంటల 45 నిమిషాల సమయంలో తాము నిద్రలో ఉన్నామని పెద్ద పెద్ద శబ్దాలకు ఉలిక్కిపడి లేచామని అన్నారు. పాకిస్థాన్ లోని మసీదులు, మదర్సాలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు చెప్పారు.

పాకిస్థాన్ లోని ప్రాంతమైన మురిడ్కేలోని మర్కాజ్‌ తొయిబా స్థావరంపై మొదట ఓ డ్రోన్ రావడం చూశామని.. ఆ తర్వాత మరో మూడు డ్రోన్లు దూసుకొచ్చాయని ప్రత్యక్ష సాక్షులు అన్నారు. డ్రోన్ల దాడికి నిద్రలో తాము లేచాం. పెద్ద పెద్ద శబ్దాలతో భయానక వాతావరణం నెలకొంది. రాత్రంతా నిద్రపోలేదు. భయంతో గడిపాం.. అని తెలిపారు.

ఇక భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ లో 70 మంది ఉగ్రవాదులు మృతి చెందారని తెలుస్తోంది. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. అయితే అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు 200 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక లెక్కలు పూర్తిస్థాయిలో రావాల్సి ఉంది.

Pakistani Eyewitness Claims to Have Seen Attacks Live in Viral Video

భారత్ నిర్వహించిన దాడుల్లో పాక్ లోని 9 కీలక ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. వాటిలో బహవల్‌ పూర్‌ లోని మర్కాజ్‌ సుభాన్‌, మురిడ్కేలోని మర్కాజ్‌ తొయిబా, తెహ్రా కలాన్‌ లోని సర్జాల్‌, సియల్‌ కోట్‌ లోని మెహ్‌ మూనా జోయా , బర్నాలలోని మర్కాజ్ అహ్లే హదీత్‌, కోట్లిలోని మర్కాజ్ అబ్బాస్‌, ముజ్ ఫరాబాద్‌ లోని షవాయ్‌ నల్లాహ, ముజ్ ఫరాబాద్‌ లోని సైద్నా బిలాల్.. ఉగ్రస్థావరాలు ఉన్నాయి.

ఇవన్నీ గతం 30 ఏళ్లుగా ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇక భారత్ నిర్వహించిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్‌ మసూద్‌ అజహర్ కుటుంబసభ్యులు హతం అయ్యారు. ఆయన కుటుంబంలోని 10 మంది, మరో నలుగురు అనుచరులు మరణించినట్లు మసూద్ అజహర్ వెల్లడించాడు.

56 ఏళ్ల మసూద్ అజహర్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పేర్కొంది. గతంలో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఆయన హస్తం ఉంది. 2001 పార్లమెంట్ అటాక్, 2008 ముంబై దాడులు, 2016 పథాన్ కోట్ దాడి, 2019 పుల్వామా దాడి.. తదితర దాడుల్లో ఆయన హస్తం ఉంది.

అయితే పాకిస్థాన్ మీడియా మసూద్ అజహర్ కూడా ఈ దాడుల్లో మరణించాడని చెబుతోంది. కానీ తాను బతికే ఉన్నానని.. తనను చింపేయకుండా తప్పు చేశారని.. భారత్ ను, ప్రధాని మోదీని అంతం చేస్తానని.. ఓ లేఖ రావడం గమనార్హం. ఇంతకీ మసూద్ బతికున్నాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. సరిహద్దు రాష్ట్రాలకు హై అలర్ట్ ప్రకటించారు. బోర్డర్ ప్రాంతాల్లో బలగాలను అధికంగా మోహరించారు. ఈ మేరకు పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+